31, డిసెంబర్ 2020, గురువారం
వీడ్కోలు...!!
29, డిసెంబర్ 2020, మంగళవారం
కాలం వెంబడి కలం...34
26, డిసెంబర్ 2020, శనివారం
పుస్తక సమీక్ష లైవ్
25, డిసెంబర్ 2020, శుక్రవారం
24, డిసెంబర్ 2020, గురువారం
ఖాళీ...!!
21, డిసెంబర్ 2020, సోమవారం
కాలం వెంబడి కలం..33
19, డిసెంబర్ 2020, శనివారం
కోరికల చిట్టా..!!
నేస్తం,
ఏంటోయ్ చాలా రోజుల తర్వాత ఈ పలకరింపులేంటా అని కోపమా.. ఏంటో ఈ మధ్యన కాస్త నిరాసక్తత అలవాటైన క్షణాలు ఎక్కువే. అలా అని వ్యాపకాన్ని వ్యసనంగా మార్చాలన్న ప్రయత్నమూ చేయలేదు. అందుకే ఈ ఆలశ్యపు పలకరింపులన్న మాట. అవునోయ్ నీ సంగతేంటో కాని కొందరికి కొన్ని తీరని కోరికలుంటాయి కదా. నాకయితే బోలెడుండిపోయాయి మరి.
చిన్నప్పటి నుండి మెుదలెడతాను. అప్పట్లో మన దేశంలో అందరికన్నా రాష్ట్రపతికి ఎక్కువ జీతం పదివేలట. ఏమైనా సరే రాష్ట్రపతి ఓసారయినా అయిపోయి పదివేల రూపాయలు తీసేసుకోవాలని. తర్వాత పాడుతా తీయగా మెుదలయ్యింది టీవిలో. అప్పటి నుండి ఓ పేద్ద కోరిక ఉండిపోయింది. పాడాలని కాదు. పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో బాలుగారి పక్కన కూర్చోవాలని. MBBS ఎలాగూ చేయలేదు MS అయినా చేయాలనుకున్నా. అదీ తీరలేదు. సరే అమెరికా వెళ్ళానా.. నయాగరా ఫాల్స్ కూడా చూడలేదు. పోని అమెరికా నుండి వచ్చాక నాకిష్టమైన స్పెషల్ తెలుగులో పిజి చేసి, తర్వాత డాక్టరేట్ కోసం ప్రయత్నించి పేరు ముందు డాక్టర్ అని అయినా పెట్టుకుందామనుకున్నా. అదీ కుదరలేదు.
చిన్నప్పటి నుండి సముద్రంలో నుండి పొద్దు పొద్దున్నే వచ్చే సూర్యుడిని చూడటానికే ముందురోజే హంసలదీవి సముద్రస్నానాల తిరునాళ్లకు వెళిపోయేవాళ్ళం. అలా అని అసలు కోరికేంటంటే కన్యాకుమారి దగ్గర పౌర్ణమి రోజు ఒకేసారి సూర్యాస్తమయాన్ని, చంద్రోదయాన్ని చూడాలని బలీయమైన కోరికన్నమాట. నా తీరని కోరికల లిస్ట్ చాలా చిన్నదే కదా... 😊 .
18, డిసెంబర్ 2020, శుక్రవారం
రాయితీలు ఇవ్వబడవు...!!
16, డిసెంబర్ 2020, బుధవారం
అంతర్లీనం..!!
14, డిసెంబర్ 2020, సోమవారం
ఏక్ తారలు
కాలం వెంబడి కలం..32
13, డిసెంబర్ 2020, ఆదివారం
కొన్ని..!!
8, డిసెంబర్ 2020, మంగళవారం
మనకో నీతి - తనకో నీతి..!!
7, డిసెంబర్ 2020, సోమవారం
తప్పొప్పులు...!!
కాలం వెంబడి కలం...31
5, డిసెంబర్ 2020, శనివారం
న్యాయం జరిగేదెన్నడో...?
ప్రవాసుని చేతిలో తెలుగు భాషకు దక్కిన అరుదైన గౌరవం....!!
3, డిసెంబర్ 2020, గురువారం
రైతు రాజీనామా...!!
30, నవంబర్ 2020, సోమవారం
కాలం వెంబడి కలం..30
29, నవంబర్ 2020, ఆదివారం
భాషాభిమానం..!!
27, నవంబర్ 2020, శుక్రవారం
సాక్షాత్కారం...!!
26, నవంబర్ 2020, గురువారం
అసంబద్ధ జీవితాలు..!!
అయెామయం...!!
24, నవంబర్ 2020, మంగళవారం
సాగర్ శ్రీరామ కవచం గారి కవితకు విశ్లేషణ
23, నవంబర్ 2020, సోమవారం
కాలం వెంబడి కలం...29
17, నవంబర్ 2020, మంగళవారం
భూతల స్వర్గమేనా..34 ఆఖరి భాగం
కాలం వెంబడి కలం..28
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఎయిర్ పోర్ట్ లో కష్టాలు ... నిజంగా దేవుడు పంపినట్టు వచ్చి సాయం చేసిన వ్యక్తి ...
16, నవంబర్ 2020, సోమవారం
మన భాషా సంస్కృతుల గొప్పదనం...!!
11, నవంబర్ 2020, బుధవారం
స్వ'గతం...!!
నేస్తం,
ఆత్మవంచన చేసుకోవడం నా అక్షరాలకు ఇష్టం ఉండదు. రాయడమైనా మానేస్తాను కాని నిజాన్ని చెప్పకుండా, ఆ నిజానికి అబద్ధపు రంగు పులమను ఎప్పుడూ. ఎవరో ఏదో అనుకుంటారనో, లేక మరేదో మాట తూలతారనో, నలుగురిలో చిన్నతనం చేస్తారనో విషయాన్ని తప్పుదోవ పట్టించలేను. అది రాజకీయమైనా, సామాజికమైనా, నా జీవితమైనా. నేను రాసేదంతా స్వ'గతం. ఏ కొందరికో తప్ప.. కుటుంబమన్నంక గొడవలు, సంసారమన్న తర్వాత ఆటుపోట్లు ఉండక తప్పదు. లేదని మనం అనుకుంటే ఇదెంత నిజమెా మనకూ తెలుసు కదా. చిన్నాచితకా బాధలు, ఆ వెనుకే సంతోషాల క్షణాల జీవితమే ఇది.
చాలా మందికి నా రాతలు బాధ కలిగించి ఉండవచ్చు. కొందరికి తమ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఉండవచ్చు. నా జీవితానుభవాలు రాయాలని ఎప్పుడూ అనుకోలేదు. నా ఫ్రెండ్ సిరి రాయమని అన్నప్పుడు కూడా నావల్ల కాదన్నాను. అనుకోకుండా రాజశేఖర్ చప్పిడి గారు అమెరికా అనుభవాలు రాయమంటే ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వెబ్ సైట్ లో రాయడం మెుదలుపెట్టాను. చాలా వరకు నేను పొందిన చిన్న సహాయాన్ని కూడా రాశాను. నేను నష్టపోయిన సొమ్ము కాని, నా మూలంగా ఎవరెలా ఉన్నారన్నవి చాలా తక్కువగా రాశాను. సాయం పొందిన వాళ్ళకు, సొమ్ము తిన్న వాళ్ళకు, పైన ఆ భగవంతుడికి ఆ విషయాలు తెలుసు. తర్వాత కవితాలయం పవన్, అంజు కవితాలయంలో ఏదైన రాయమంటే పుస్తకానుభవాలు రాద్దామని మెుదలుబెడితే అది నా జీవితానుభవాలు రాయడంగా మారింది.
అమెరికన్ సొల్యుషన్స్ వాళ్ళు అమెరికా, ఇండియాల్లో నన్ను ఎంతగా మెాసం చేసారన్నది నేను తెలిసిన సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో అందరికి తెలుసు. సుబ్బరాజు ఇందుకూరి నాకు చేస్తానన్నవి చేయనీయకుండా చేసి, ఆ కంపెని ఇండియాలో మూసుకుపోవడానికి ప్రధాన కారకులు, నన్ను బాగా ఇబ్బంది పెట్టిన ముగ్గురు మహానుభావులను ఎప్పటికి మర్చిపోను.
మా ఇంజనీరింగ్ బాచ్ చాలామంది ఎవరికి వారుగా ఉన్నారు. మిగతా అన్ని బాచ్ ల వాళ్ళు వాళ్ళ వాళ్ళకి హెల్ప్ చేసుకున్నారు చాలా విషయాల్లో అది అమెరికాలోనైనా, ఇండియాలోనైనా. మరి వీళ్ళెందుకు ఇలానో.
నా రాతలు పుస్తకాలుగా రావడానికి చాలా చాలా హెల్ప్ చేసింది నా ఇంజనీరింగ్ ఆత్మీయనేస్తాలు. మెుదటి పుస్తకం మా విశాలక్క, వెంకటేశ్వరరావు బాబాయ్ వేయించారు. రెండు పుస్తకాలు రామకృష్ణ వజ్జా గారు వేయించారు. మరో రెండు పుస్తకాలు అనిత, శోభ, నీరజ, మమత, నీలిమ కలిసి వేయించారు. రఘు యడ్ల, అనురాధ కోనేరు చెరొక పుస్తకం వేయించారు. అందరికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు. నేను రాసే సమీక్షలను ప్రచురిస్తున్న కత్తిమండ ప్రతాప్ గారికి, గోదావరి యాజమాన్యానికి, రాయడం రాదన్న నాతో నవ మల్లెతీగలో జీవన "మంజూ"ష శీర్షిక గత మూడు సంవత్సరాలుగా రాయిస్తున్న కలిమిశ్రీ గారికి, రాయడంలో, పుస్తకాలు వేయడంలో నన్నెంతగానో ప్రోత్సాహించిన కొండ్రెడ్డి అంకుల్, సాగర్ శ్రీరామ కవచం అంకుల్ ఇంకా మరెందరో మహానుభావులకు నా వందనాలు. నా రాతలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా మనఃపూర్వక ధన్యవాదాలు...
ఎవరైనా నా రాతల మూలంగా బాధపడితే పెద్ద మనసుతో మన్నించేయండి మరి... 😊