14, సెప్టెంబర్ 2020, సోమవారం
కాలం వెంబడి కలం...19
మేం ఇల్లు కట్టుకున్నప్పుడు రాని అయినవారందరు, మామయ్య పెళ్ళికి వచ్చారు. అంతా బాగా జరిగిపోయింది. మామయ్య పెళ్ళికి ముందే మా చిన్నప్పటి శిశు విద్యామందిరం స్కూల్ ఫ్రెండ్ ని ఓ రోజు రాత్రిపూట రమణ (మామయ్య) తీసుకువచ్చాడు, లాల్ కిషోర్ గుర్తుపట్టావా అని. తనకి రొయ్యల వ్యాపారంలో హెల్ప్ కావాలంటే నాన్న చేసారు. మరో విషయమేమిటంటే మమ్మల్ని మెాసం చేసిన విజయనగరం ఆయన కొడుకు వ్యాపారంలో నాన్న హెల్ప్ కావాలని ఇంటికి వస్తే తనకి హెల్ప్ చేసారు. రాఘవేంద్ర ఇంటి మనిషిలా కలిసిపోయాడు. వీళ్ళ అక్క మా అమ్మ క్లాస్మేట్స్. ఆవిడ కొడుకు 12 ఏళ్ళు పెరిగి, ఈతకి వెళ్ళి పులిగడ్డ వంతెన దగ్గర మునిగి చనిపోయాడు. రాఘవేంద్ర వాళ్ళు ఆరుగురు సంతానం వాళ్ళ అమ్మానాన్నకు. వీళ్ళ చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోయారు. నాన్న కాన్సర్ తో, అమ్మ సూసైడ్ చేసుకున్నారట. పెద్దక్క బాధ్యత తీసుకుంది, టీచర్ జాబ్ చేస్తూ. ఆవిడ పెళ్ళి చేసుకున్నాక, రెండో అక్క వేరే వెళిపోయింది. అన్నయ్య కొన్ని రోజులు మా ఊరి వాళ్ళ ట్రాక్టర్ మీద ఉండి, చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యాక, హైదరాబాదు వెళిపోయారు. తర్వాత ఎయిర్ ఫోర్స్ లో జాబ్ వచ్చిందంట. ఈ రాఘవేంద్రరావు గారు వాళ్ళ నాన్నకు మల్లే జనం మనిషి. ఇంటివాళ్ళు పట్టరు. చిన్న తమ్ముడిని వీళ్ళ బావగారు గవర్నమెంట్ హాస్టల్ లో జాయిన్ చేసారు. చిన్న చెల్లిని చదివించడం జరిగింది. నాకు తెలిసే సరికి..చిన్న తమ్ముడంటే అక్కలకి బాగా ఇష్టం. అందులోనూ పెద్దావిడ కొడుకు చనిపోయాక, ఆవిడ తన ప్రేమనంతా ఆ తమ్ముడి మీద పెట్టుకుందట.
నాకు ఈవిడ పరిచయం అయ్యేసరికి పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు హైదరాబాదు లో కలిసి ఉండేవారు. పెద్ద తమ్ముడి పెళ్ళి ఈవిడే చేసిందట.చిన్న తమ్ముడు డిగ్రీ చదివి, డయాలసిస్ నేర్చుకుని, మెడికల్ సైడ్ మంచి ఉద్యోగమే అప్పుడు. చిన్న చెల్లి కూడా హైదరాబాదులోనే డిగ్రీ చదువుతోంది. అంతకు ముందు పాలిటెక్నిక్ లో జాయిన్ చేస్తే ఓ సంవత్సరం చదివి, చదవనంటే డిగ్రీ లో జాయిన్ చేసారంట. పెద్ద చెల్లి వీళ్ళ సొంత ఊరు హరిపురంలోనే ఉండేది. ఆమెకు ఓ బాబు. మెుత్తానికి అక్కాచెల్లెళ్ళ గొడవలో, చెల్లెలు విడిపోయి, వేరే అతను పెళ్ళి చేసుకుంటానంటే తనతో ఉండేదిట. వాడు మెాసం చేసినా బాబుతో అక్కడే ఉండేది. బావగారు, చల్లపల్లి శ్రీనివాసరావు గారు పనికిమాలిన మధ్యవర్తిత్వాలు చేసి ఆమెకు అన్యాయం చేసారు. వీళ్ళ కుటుంబంలో ఎవరు ఆమెను పట్టించుకునే వారు కాదు అప్పట్లో. అక్కచెల్లెళ్ళు ఇద్దరికి బాగా ఇగో ఉండటంతో వీళ్ళ తల్లిదండ్రుల ఆస్తిని పంచుకున్నప్పుడు పెద్ద చెల్లి వాటా తనకి ఇచ్చేసి, మిగతాది ఈవిడ ఉంచుకుని బాధ్యతలు అన్నీ తానే మెాసాననని చెప్పేది. రాఘవేంద్ర మాకు తెలిసేటప్పటికి మా ఊరిలో ఆ ఇంట్లో, ఈ ఇంట్లో ఉంటూ ఉండేవాడు. అందరిని చూస్తే నన్ను మెాసం చేసారందరు, ఎవరు మాట్లాడరు అని ఈయన పెద్దక్క బాధ పడుతూ ఉండేది. నాకు బాధనిపించి అక్కతో ఎక్కువగానే మాట్లాడుతుండేదాన్ని.
వచ్చే వారం మరిన్ని కబుర్లతో....
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
"లాల్ కిషోర్ గుర్తుపట్టావా అని"
లాల్ కిషోర్ గారని మాకు తెలిసిన ప్రొఫెసర్ ఉన్నారు. వారే మీ స్నేహితులు అయుంటారనుకుంటా.
కాదండి...తను ప్రోఫెసర్ కాదు.. ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి