మాటున దాచిన
మౌన’మది
మాటల చాటున
దుఃఖ‘మది
కలల తీరాల
కావ్య’మది
కలవని బంధాల
బంధన’మది
ఆటుపోట్లకు వెరవని
సంద్ర’మది
రెప్పల అలజడి
కన్నీటి’మ(న)ది
అనుబంధపు ఉప్పెనకు సాక్షిగా
మిగిలిన ఒంటరితన’మది
రాయలేని భావాలకు
రూపమివ్వలేని అక్షర’మది
అంతర్వేదన అనంత భావోద్వేగాల
సమ్మిళిత’మ(మి)ది
పాశాలకై ప్రాకులాడుతూ ప్రాణాలొడ్డే
అమ్మ’మది..!!
(వనజ తాతినేని గారి “పయిలం బిడ్డా” కథ విన్న తర్వాత
ఇలా రాయాలనిపించింది)