5, మే 2025, సోమవారం

శూన్యంతో చ’లోక్తులు..!!

 


      అనంత విశ్వంలో ఆవరించిన శూన్యానిదో ప్రత్యేక స్థానం. ఏమి లేదనుకునే శూన్యంలో ఎన్నో విశేషాలున్నాయని, మరెన్నో ఆత్మానుబంధాల అనుభూతులను శూన్యంతో పంచుకోవడం చాలా సులభమనిఫిజిక్స్ అరుణ్ కుమార్గారు తన తొలి కవితా సంపుటిశూన్యంతో తన మనసు భావాలను అందించారు

       “నా గుండె లోలలకమైకవితలో ప్రేమకు సరికొత్త భాష్యాన్ని చెప్పారు. భౌతిక శాస్త్రం పై తనకున్న ప్రేమను, ఇష్టాన్ని ప్రతి కవితలోనూ చూపించారు. అమ్మను, బాల్యాన్ని, సైనికుల సాహసాన్ని, వారి త్యాగాన్ని, గాంధీ, శ్రీ శ్రీ వంటి ఎందరో గొప్పవారిని, రైతన్న వేదనను, కష్టాలను, మహిళలపై జరుగుతున్న అకృత్యాలను, ట్రోలింగ్ ను విశ్వవిజేతలను, విశ్వ రహస్యాలను ఇలా ప్రతి విషయాన్ని చక్కగా తన కవితల్లో పొందుపరిచారు. గురువు గురించి రాసిన కవితఅయస్కాంత దిక్సూచిలోమానవీయతకు మరో కోణం గురువుఅనడం చాలా నచ్చింది

    చివరిగా తనసాపేక్షతా సిద్దాంతంలో 

జీవితం లేని జీతాన్ని

  జీతం లేని జీవితాన్ని

  ఒకేలాగా ప్రేమించి జీవన ప్రయాణపు

  పరిమళాన్ని అన్వేషించినవాణ్ణిఅంటూ తన మనసుని విశ్వానికి అనుసంధానం చేసి విజ్ఞానశాస్త్రాన్ని తెలుగు కవిత్వంతో మమేకం చేస్తూశూన్యంకవిత్వ సంపుటితో వేల శూన్యాల గొంతుకలను ప్రోది చేసి చెప్పిన భావనలు చాలా చాలా బావున్నాయి. అనంత విశ్వంలో ఆక్రమించిన ఎవరికి కొరుకుడు పడనిశూన్యంని అద్భుతంగా ఆవిష్కరించినఫిజిక్స్ అరుణ్ కుమార్గారికి హృదయపూర్వక అభినందనలు.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner