5, మే 2025, సోమవారం

పంచుకుంటే..!!



 నేస్తాలు,

         కొన్ని సంతోషాలను పంచుకోకపోతే అస్సలు బావుండదు. చిన్నప్పటి గురువులు మనల్ని గుర్తుంచుకోవడమే గొప్ప విషయం. గుర్తుంచుకోవడమే కాకుండా అప్పుడప్పుడు ఫోనులో పలకరిస్తూ..మనింటికే వచ్చి కలిస్తే..! ఆనందానికి కొలమానముంటుందా! సంతోషమే ఈరోజు పోస్ట్ రాయడానికి కారణం

         అవనిగడ్డ శ్రీ గద్దె వెంకట సత్యనారాయణ శిశువిగ్యామందిరంలో రెండు నుండి ఆరు వరకు చదువుకున్నాను. దయచేసి గమనించండి చదువుకున్నాను..కాని కొనలేదు. పాటలను, డాన్సులను మాకు తొలుతగా పరిచయం చేసింది మాత్రం శ్రీలత టీచర్ గారు. స్కూల్ వార్షికోత్సవాలకి కూడా అంతా టీచర్ గారే చేసేవారు. ఎందుకనో మేము ఆరో తరగతి చదివేటప్పుడు సంవత్సరం స్కూల్ వార్షికోత్సవం చేయలేదు. మా మూర్తిమహల్ వీధిలో పిల్లలం అందరం కలిసి పాటల, డాన్స్ ప్రోగ్రాం ప్లాన్ చేసి అందరిని పిలిచి చక్కగా ప్రోగ్రాం చేసేసాం కూడా. డాన్స్ లకు ఇప్పటి కొరియోగ్రాఫ్ అప్పట్లో మేమే చేసామన్న మాట. మా టీచర్ గారు కూడా వచ్చారు అప్పుడు. ఎంతయినా ఆవిడ శిష్యులమే కదా

          ఆరు చదివేటప్పుడు వాళ్ళింట్లోనే పడుకునే వాళ్ళం. సెకండ్ షో సినిమాలు, మిలటరీ హోటల్ బిరియాని అప్పుడప్పుడు అలా ఎంజాయ్ చేసేవాళ్ళమన్న మాట. టీచర్ గారిది మచిలీపట్నం. ఆవిడ వెళుతూ నన్ను కూడా వాళ్ళింటికి తీసుకెళ్లేవారు. తర్వాత స్కూల్ ఎగ్గొట్టినందుకు మా హెడ్ మాస్టారు రత్నారావు గారు తిట్టేవారనుకోండి..అది వేరే సంగతి. కృష్ణాష్టమి వస్తే ఇప్పటికీ నాకు రోజులు గుర్తు వస్తాయి. ఎంత బాగా అలంకరణ చేసేవారమో. అల్లరి కూడా అంతే చేసేవాళ్ళం. తర్వాత విజయనగరం మురళి అన్నయ్య కూడా గుర్తు వస్తాడు. తన పుట్టినరోజు రోజే

           మా టీచర్లు మాకు విలువలు నేర్పారు. మరి మాతో కలిసి చదువుకున్న కొందరు మాత్రం నన్నంటుకోకు నా..కాకి అన్నట్టు వుంటున్నారు. ఏం చేస్తాం ఎవరి లెక్కలు వారివి. శ్రీలత టీచర్ గారు వారి అమ్మాయితో వచ్చి నన్ను కలవడం మాత్రం మాటల్లో చెప్పలేనంత ఆనందం నాకు. థాంక్యూ సోమచ్ టీచర్ గారు


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner