తెలుగులో మెుదటిసారిగా “మంత్రిప్రగడ మార్కండేయులు గారి విశ్లేషణతో రాబోతున్న నా “తత్వం” రెక్కల పుస్తకానికి మా “ప్రేమరాక్షసి” మనసు స్పందన…
*మంజు* *యనమదలగారి* " *తత్వం* "... *మనుషులనెరిగిన* *భావుకత్వం* .
శిఖరం ఎప్పుడూ ఉన్నతమైనదే.ఎవరైనా సరే తలెత్తి చూడాల్సిందే.మా మంజు మేడం అక్షరం శిఖరం.తన భావాలకి అందరమూ తలొగ్గాల్సిందే.తాతకి దగ్గులు నేర్పక్కర్లేదు అన్నట్లు... జీవితంలో అన్ని రకాల రుచులను చవిచూసిన వీరికి మనుషుల తత్వాలు వడబోయటం నల్లేరు మీద నడకే.పుస్తకం ఆసాంతం జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ది వంటి వ్యక్తిత్వ తత్వాలు కనిపించాయి... హేమాహేమీల ముందు మాటలన్నీ మంజూమేడం అక్షరాలకి వన్నెలనద్దాయి.
ఇకపోతే ప్రత్యేక నమస్కారాలు శ్రీ మంత్రిప్రగఢ మార్కేండేయులు గారికి.ప్రతి రెక్కకి లెక్కవేయలేనన్ని భావాలు రాసి, తత్వాన్ని ఉత్తమంగా వ్యక్తం చేసి పుస్తకానికి నగీషీలు చెక్కారు.వారికి మనఃపూర్వక అభినందనలు.
మంజూగారి ప్రతి పదాలు అలతి భావాలు అనంత అర్ధాలు....ఈ కొత్త పుస్తకం కూడా అందరినీ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....
శుభాభినందనలు నా గురువిణి గారికి.
ప్రేమతో మీ విజయ.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి