1. చిరాకు
పరాకు
కోపం
అసహనం
అందరికి
ఉన్న ఆస్తులే..!!
2. మనసెప్పుడు
కనబడదు
మౌనమెప్పుడు
వినబడదు
అంతర్యానమే
పరమార్థం..!!
3. గెలుపు
క్షణాలు
ఓటమి
పాఠాలు
చీకటి వెలుగుల
చిరుదివ్వెలు..!!
4. మనం
ఇచ్చినదే
మనకి
తిరిగి వస్తుంది
మనమేంటో
మన చావు చెబుతుంది..!!
5. అతిశయం
అక్షరాలది
ఆలోచన
మనసుది
రాతగీత
దైవదత్తం..!!
6. ఆధారం
అవసరమే
అవకాశం
తీసుకోవడం
ఉచితానుచితాలు
లెక్కించబడతాయి..!!
7. అక్షరాలతో
ఆటలు
పుస్తకాలు నేర్పిన
పాఠాలు
జీవితంతో
యుద్ధం..!!
8. మితానికి
పరిమితి
అమితానికి
అపరిమితం
పరిధి
విశాలం..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి