22, అక్టోబర్ 2010, శుక్రవారం

ఆకులో....

నా చిన్నప్పుడు నాకెంతో ఇష్టమైన మేఘసందేశం సినిమా లోని ఈ పాట వీలుంటే ఒక్కసారి విని చూడండి ఎంత బావుంటుందో...ఇక్కడ మాత్రం పాట చదవడానికి మాత్రమే...

ఆకులో
ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో
గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై
గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజల నీ పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేతినై
పరువంపు విడిచేదే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఎచటనే ఆగిపోనా
ఆకులో
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఎచటనే ఆగిపోనా
ఆకులో

21, అక్టోబర్ 2010, గురువారం

వెలకట్టలేనిది....

స్వాతి చినుకుల్లో నుంచి జారిపడిన
ఓ చిన్న చినుకు ఆల్చిప్పలో పడి
స్వచ్చమైన మంచి ముత్యంగా మారినట్లే...
ప్రతి ఫలాపేక్ష లేని కల్మషమెరుగని నేస్తం దొరికితే
ఆ స్నేహ మాధుర్యానికి సాటిలేదు మరేది ఈ సృష్టిలో

20, అక్టోబర్ 2010, బుధవారం

అవసరానికి మాత్రమే అన్నీ....

ఇప్పటి రోజులలో బంధాలు-అనుబంధాలు, ప్రేమ-ఆప్యాయతలు అన్నీ అవసరం చుట్టూనో లేదా అందరిని శాసించే డబ్బు- అధికారం చుట్టూనో తిరుగుతున్నాయని మన అందరికి తెలిసిన జగమెరిగిన కాదనలేని నిజం.
ఇల్లు, ఆఫీసు ఏదైనా కానియండి అవసరానికి తేడా లేదు. ఎదుటి వాడితో పని లేనప్పుడు అస్సలు వాడెవడో మనకు తెలియదు, అదే మనకు వాడితో పని ఉందనుకోండి వాడే కాకుండా వాడి స్నేహితులు, చుట్టాలు అందరు మనకు బాగా తెలిసిన వాళ్ళు అవుతారు ఆ క్షణంలో.... కాదంటారా!! ఇదే సిద్ధాంతాన్ని మనపై ఎదుటి వాడు కుడా ఉపయోగిస్తే మనం ఎలా అనుకుంటామో, ఎంత బాధ పడతామో ఓ క్షణం ఆలోచిస్తే అప్పుడైనా కొద్దిగా మన ఆలోచనల్లో, అలవాట్లలో, పద్దతుల్లో కొద్దిగానైనా మార్పు అనేది వస్తుందేమో అని చిన్ని ఆశ. అవసరం అనేది ఎప్పుడైనా ఎవరితోనైనా రావచ్చు. ఇది ఎంతటివారికైనా తప్పనిది. ఈ ఇల్లు ఆ ఇంటికి ఎంత దూరమో ఆ ఇల్లు ఈ ఇంటికి అంతే దూరం కదా!! మనం ఇబ్బందిలో ఉన్నప్పుడే ఓదార్చే మనసు కాని మనిషి కాని కావాలి.....అది డబ్బుతోనో అధికారంతోనో రాదు. మన నోటి మంచితనం కానివ్వండి, జాలికానివ్వండి మరికేందైనా కానివ్వండి అప్పటి పరిస్థితికి మనోధైర్యాన్ని ఇవ్వగలిగే మాట సాయం లేదా నీకు నేనున్నాను అని చెప్పే స్వాంతన , ధైర్యం ఎంతో విలువైనవి...ఆ ఆలంబనని దూరం చేసుకోకండి. దూరం చేసుకుంటే మీకన్నా ఈ ప్రపంచం లో దురదృష్టవంతుడు వుండడు. ఎవరైనా ఈ టపా మూలంగా బాధ పడితే క్షమించగలరు....

19, అక్టోబర్ 2010, మంగళవారం

చదువుకై సాయం....

అమ్మానాన్న లేని పేద విద్యార్దుల చదువు కోసం స్థాపించిన సంస్థ ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఈ సంవత్సరం అందించిన సహాయ వివరాలు క్రింది లింక్ లో చూడండి..
http://epaper.sakshi.com/apnews/Avanigadda/19102010/Details.aspx?id=636810&boxid=25252184

ప్రతి ఏటా మాకు తోచిన సాయాన్ని అందిస్తున్నాము. మనసున్న ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వాములే...స్పందించే సహృదయులందరికి మా హృదయపూర్వక స్వాగతం....వివరాల కోసం www.urlctrust.com లో చూడండి...

13, అక్టోబర్ 2010, బుధవారం

నీవెక్కడ???

విరిసే వెన్నెలలో....
వీచే చిరుగాలిలో....
కురిసే చిటపట చినుకులలో....
చుట్టుముట్టిన నీ ఆలోచనలతో....
జాబిలమ్మను అడిగా నీ జాడ కొరకై !!
వచ్చే పున్నమికైనా చెప్పమని....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner