8, మార్చి 2011, మంగళవారం

నిన్నటి పాడుతా తీయగా....లో

ఈసారి పాడుతా తీయగా గురించి టపా రాయాల్సిన అవసరం రాదేమో అనుకున్నాను కాని రాయక తప్పడం లేదు. బాలు గారు ముందుగా నన్ను క్షమించాలి...నిన్నటి ఎపిసోడ్ లో అంజని నిఖిల పాడిన వేదం లా ఘోషించే గోదావరి పాటలో (శోభ అంటాము కాని షోభ అనం కదా) శోభిల్లే కి షోభిల్లే అని పాడాలని చెప్పారు. ముందుగా స శ ష లలో బాలు గారు చూసుకోవాలి ఒక్కో సారి బానే చెప్తారు మరోసారి మరోలా చెప్తే పిల్లలు ఎలా పాడాలో తెలియని అయోమయం లో పడిపోతారు. అంజని నిఖిల బానే పాడుతుంది కాని పాడేటప్పుడు మద్యలో చాలా సార్లు గాలి శబ్దం కుడా వినిపిస్తుంది మరి అది గమనించారో లేదో బాలు గారు..నిన్నటి ఎపిసోడ్లో నాకనిపించింది రాఘవేంద్ర చాలా బాగా పాడాడు అని...మరి ఎందుకు బాలు గారు తప్పుగా తీర్పు చెప్తున్నారో తెలియడం లేదు. అంజని నిఖిల కంటే చాలా బాగా పాడాడు రాఘవేంద్ర. దయ చేసి బాలు గారు నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలని కోరుకుంటున్నాను.........

7, మార్చి 2011, సోమవారం

ఆత్మహత్యలు ఎందుకు..??

క్రిందటి వారం విన్న ఓ విష్యం మనసును బాగా కలచి వేసింది.
అందరికి సమస్యలు వుంటాయి చిన్నవో చితకవో...మనది మనకు చాల పెద్దది గా ఆ బాధ ఎవరు పడలేదేమో అనిపిస్తుంది. అలా అని ప్రతి సమస్యకు ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో ఇంతమంది జీవించి వుండేవారు కాదేమో!!
ఎన్ టి వి లో లైవ్ ఇంజనీర్ గా పని చేసే ఒకతను హెచ్ ఆర్ లో వేధింపులు తట్టుకోలేక తనకు ఇష్టం లేక పోయినా బతకాలని ఎంతో వున్నా అర్ధాంతరంగా జీవితాన్ని బలవంతంగా ముగించుకున్నాడు. ఇద్దరు చిన్న పిల్లలు...పద్దెనిమిది నెలలు, రెండు నెలలు వున్న చిన్న చిన్న పిల్లలు , భార్యకు కుడా పెద్ద వయసు లేదు చిన్న అమ్మాయి. బాగా లేని వాళ్ళు. తను చని పోయే ముందు రాసిన ఉత్తరంలో హెచ్ ఆర్ వేధింపులు తట్టుకోలేకనే ఇష్టం లేక పోయినా బలవంతం గా రాజీనామా చేయించారని, అందుకే చనిపోతున్నానని రాసి, ఇంక ఎవరికీ అలా వేధింపులు లేకుండా చేయమని ఆఖరి కోరిక కోరాడు. మరి యాజమాన్యం ఎంత వరకు స్పందిస్తుంది అనేది, బడాబాబులకు కొమ్ము కాసే పోలీసులు, చట్టం ఇలాంటి అన్యాయాలకు ఎలా న్యాయం చేస్తారనేది ప్రశ్నార్ధకమే?? వాళ్ళను తలచుకుంటుంటే చాలా బాధగా అనిపిస్తోంది....పోయిన వాడు పోయాడు బతికి వున్న వీళ్ళ పరిస్థితి ఏంటి?
ఏ సమస్యకు అయినా చావు పరిష్కారం కాదు. చనిపోవాలని అనుకున్నప్పుడు ఒక్క క్షణం మీ మీద ఆధారపడిన కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోండి.....!! పిరికి వాళ్ళలా సమస్యకు తలవంచకండి. ధైర్యం గా ఎదుర్కోండి....ఆ క్షణంలో మీ ఆలోచనను దారి మళ్ళించండి, ఓ మంచి జీవితం మీకు, మిమ్మల్ని నమ్ముకున్న వారికి దొరుకుతుంది. అంతే కాని అందరిని నట్టేట్లో ముంచి మీ మానాన మీరు వెళిపోతే మీ కోసమే బతికే వారి గతి ఏంటి? అని ఒక్క క్షణం ఆత్మ విమర్శ చేసుకోండి. భగవంతుడు మనకు మాత్రమే ఇచ్చిన అందమైన జీవితం మన సొంతం అవుతుంది. సమస్యతో పోట్లాడండి...తప్పక అది మీకు తలవంచి విజయాన్ని అందిస్తుంది. ప్రతి సమస్యకు పరిష్కారం వుంది. ఆత్మహత్య మాత్రం పరిష్కారం కాదు గుర్తు ఉంచుకోండి...!!

4, మార్చి 2011, శుక్రవారం

చిగురాకు చేయూత...!!

చిగురులు వేసే చిన్నారి ఆకు ఆహ్లాదానికి ఆనవాలం!!
హరిత వర్ణాల అందాల ఆకు ఆరోగ్యానికి చిరునామా!!
నునునిగ్గుల మొగ్గలకు సంరక్షణ ఈ ఆకు రక్షణ
గువ్వల గూటికి, పొదరింటి పరదాలకు పెట్టినిల్లు
పువ్వు లేని తావి సాద్యం కాని...ఆకులేని మొక్కని
ఊహించుటే అసాద్యం!!
రాలే ప్రతి ఆకు నేర్పుతుంది ఓ పాఠం...
కొత్త చిగురుల తొడుగులతో రాలిన చోటే
కొత్త అందాలతో జనించే ఆకుతో
ఓడిన చోటే గెలుపుకు బాటలు వేసుకుని
గర్వంగా తల ఎత్తుకు నిలబడమనే ఓ జీవిత సత్యం!!
ప్రాణ వాయువుతో ప్రాణాలు నింపి రాలిపోతూ కుడా ఓషదులతో
సాయమందించే ఆకు...గెలుపు పాటను మనకు నేర్పి
పచ్చదనాల పరువాలతో ప్రపంచ శాంతిని తనలో
నింపుకున్న చిన్ని ఆకు ఎన్ని జీవిత సత్యాలను
తనలో ఇముడ్చుకుందో!! ఎంత ఎదిగినా ఒదిగి వుండే వినమ్రమైన
వినయాన్ని నేర్చుకోమని చక్కని చిరుగాలితో కలసి
చల్లదన్నాన్ని, ఆహ్లాదాన్ని మనకందిచే రెండక్షరాల ఆకు గొప్పదనం
ఎలా చెప్పేది?
(నీలహంస సత్య గారి ఆకు కవితల పోటికి రాసిన చిరు కవిత)

3, మార్చి 2011, గురువారం

బెస్ట్ అఫ్ లక్ ఇండియా.....


ఒకటే జననం ఒకటే మరణం ఒకటే లక్ష్యం అదే అదే ఈ సారి ప్రపంచ కప్ సొంతం చేసుకోవడం....టీం ఇండియా ధ్యేయం కావాలి.
నిన్నటి ఐర్లాండ్ ఆట తీరు చూసి మన వాళ్ళు నేర్చుకోవలసినది చాలా వుంది. ప్రపంచ కప్ లో తొలి అడుగు దగ్గర నుంచి ఐర్లాండ్ ఆట తీరు చాలా బాగుంది. ఆ పోరాట పఠిమే మన వాళ్లకు కావాలి...ప్రతి ఒక్క ఆటగాడి లక్ష్యం చివరి వరకు గెలుపు మీదే వుండాలి. ఎవరు వున్నా లేక పోయినా ప్రతి ఒక్కరు తమ ఆటకు న్యాయం చేయాలి. చివరి బంతి వరకు గెలుపు కోసం పోరాటమే లక్ష్యం కావాలి. ప్రపంచకప్ లో ప్రతి ఒక్క బాట్స్ మాన్ పరుగులు చేద్దామనే అనుకుంటారు, అలానే ప్రతి ఒక్క బాల్ కి వికెట్ పడగొట్టాలని బౌలర్ అనుకుంటాడు. సంకల్పబలం తో ముందుకి అడుగు వేస్తే విజయం మనదే.....
కోట్లాది భారతీయుల కలని నిజం చేసే సత్తా వుండి కుడా ప్రపంచకప్ గగన కుసుమం ఐపోయింది మన టీం ఇండియాకి.
గతాన్ని ఘనం గా చెప్పుకోవడం తప్ప విజయాన్ని అందుకోలేక పోతున్నాము. ఈ సారి అయినా కోట్లాదిమంది భారతీయుల ఆశలను, కలలను నిజం చేస్తూ ప్రపంచ కప్ తో మన టీం ఇండియా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని రావాలని కోరుకుంటూ.......బెస్ట్ అఫ్ లక్ ఇండియా.....
లైవ్ స్కోరు....ఇతర వివరాల కొరకు ఈ క్రింది వెబ్ సైట్ ని చూడండి
www.cricdude.com

1, మార్చి 2011, మంగళవారం

నిన్నటి పాడుతా తీయగా గురించి నాలుగు మాటలు

నిన్న రాత్రి పాడుతా తీయగా ప్రోగ్రాం గురించి నాలుగూ మాటలు చెప్పాలనే ఈ టపా!!
ఇన్ని రోజులకి ధర్మం గా ప్రతిభకి పట్టం కట్టారు బాలు గారు. ఈ మద్య బాలు గారి జడ్జిమెంట్లో లోపాలే ఎక్కువగా కనిపించాయి. అతిధిగా వచ్చిన వాసు గారు మొదటి రౌండ్ లో కొద్ది గా అతి అనిపించారు. తరువాత బాగా మాట్లాడారు.
ఎందుకో ఈసారి గణేష్ బాగా వెనక్కి వెళిపోయాడు. అంజని నిఖిల చాలా బాగా పాడింది కొద్దిగా వత్తులు చూసుకోవాలి.
రాఘవేంద్ర తనేంటో చక్కగా నిరూపించాడు. మిగిలిన ఇద్దరు పిల్లలు కుడా బాగా పాడారు. ఎవరు బాగా పాడుతున్నారు అనేది చెప్పడం రాను రాను కష్టంగా ఐపోతోంది. మంచి పాటలతో శ్రోతలను అలరింపచేయాలని అందరూ బాగా పాడాలని అందరికి శుభాకాంక్షలు అభినందనలు.....బెస్ట్ అఫ్ లక్
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner