8, నవంబర్ 2012, గురువారం
6, నవంబర్ 2012, మంగళవారం
5, నవంబర్ 2012, సోమవారం
సినిమాల గొడవలు.....
ఏంటో ఈ మధ్య సినిమాల కన్నా వాటి మీద ఏదో ఒక గొడవ ఎక్కువైపోయింది...ఆ పాట నాదని ఒకరు.....ఈ సినిమా కధ నాదని మరొకరు....అదిగో మమ్మల్ని తక్కువ చేసారని ఒక వర్గం...ఇదిగో మమ్మల్ని తిట్టారని ఇంకొకరు...మమ్మల్ని రౌడీలు అన్నారని ఒకరు...మేము మాత్రమే ఫ్యాక్షనిస్టులమా అని ఇంకొకరు....ఫలానా సీనులో మమ్మల్ని కించపర్చారు...ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి....!!
హాస్యం అనేది అలానే వుండాలి కాని ఒకరిని నొప్పించేదిగా ఉండకూడదు...బోలెడు ఖర్చు పెట్టి ఎంతో శ్రమ పడి తీసే సినిమా ఆహ్లాదంగా వుండాలి...కాని ఒకరిని నొప్పించేదిగా ఉండకూడదు....!!
ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే....సినిమాని వినోద ప్రధానంగానో....లేదా ఒక మంచి విషయాన్ని చెప్పే మాధ్యమం గానో...చూడాలని నా విన్నపం..సినిమాలలో వినోదం కోసమో....కాసేపు నవ్వు కోవడం కోసమో...కొన్ని సన్నివేశాలు తీసినంత మాత్రాన అవి నిజాలు అయిపోవు కదా..!! మంచి చెడు అందరిలోనూ వుంటాయి...అన్ని వర్గాలలోను..ప్రాంతాలలోను...మంచి చెడు వుంటుంది...వేషం...భాష...పద్దతులు...ఇలా అన్ని ఒక్కలా వుండవు కదా..అందరివి...!! మన చేతికి ఉన్న ఐదు వేళ్ళే ఒకలా లేనప్పుడు....ఒక అమ్మ కడుపున పుట్టిన పది మంది ఒకలా లేనప్పుడు వేరు వేరు ప్రాంతాల వాళ్ళు వర్గాల వాళ్ళు ఒకలా ఎలా వుంటారు....??
మరీ ఈ మధ్యనే ఈ సినిమాల గొడవలు ఎక్కువై పోతున్నాయి....అందరికి మేలు జరిగే సమస్యలపై దృష్టి పెడితే....బావుంటుంది...!!

వర్గము
కబుర్లు
3, నవంబర్ 2012, శనివారం
మార్పు..!!
పుస్తకాలు చదివినంత మాత్రాన కాని..వార్తలు చూసినంతనే కాని..ఉత్తరాలు చదివినంత మాత్రాన జనాలు మారతారా...!! అంటే ఏమో తెలియదు కాని ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం లో ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్ మూడు వుండేది...కొత్తగా వచ్చిన శివారెడ్డి ఆ క్లాసు తీసుకునేవారు. ఒక రోజు పరీక్ష పెడితే ముందుగా నేనే రాయకుండా బయటికి వెళిపోయాను...నా తరువాత చాలా మంది వచ్చేసారు...అందరివి పేర్లు ఆయన నోట్ చేసుకున్నారనుకుంటా..!! ఫైనల్ ఎగ్జామ్స్ లో ప్రాక్టికల్స్ లో ఆ లాబ్ లో వరుసగా క్లాసు లో పరీక్ష రాయని అందరిని ఎదో ఒక వంక పెట్టి ఫెయిల్ చేస్తున్నారు...ఇక నా వంతు వచ్చింది....నేను సర్క్యూట్స్ కాని, రీడింగ్స్ కాని కరక్ట్ గా వుంటాను....కాక పొతే ఇక్కడ ఏమైందంటే...ముందు మనకి వచ్చిన దానికి సర్క్యూట్స్ , టేబుల్స్, ఫార్ములా వేసి సార్ కి చూపించి కరక్ట్ అంటే మిగిలినది చేయాలి...అందుకని ముందు వేసి చూపిస్తే...రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో అన్నారు....సరిగానే వేసా కదా ఇలా అంటున్నారేంటా అని నాకు డౌట్ వచ్చి మొత్తానికి కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళి వేరేది వేసి చూపించా..!! ఉచ్ ఒన్ యు వాంట్ టు డు..డు ఇట్ అన్నారు...మళ్ళి వెంటనే వైవా కి రమ్మని పిలిచారు...అడిగి పంపేసారు....ఆ రోజు హాస్టల్ కి వచ్చేసాక ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేసాను...తెలుగులోనే సుమా రాసింది...ఆయనకు తెలుగు చదవడం రాదనుకుంటా..!! వాళ్ళ ఫ్రెండ్ తో చదివించుకున్నట్లు వున్నారు....!!మరుసటి రోజు నా ఫ్రెండ్ తమిళ్ అమ్మాయి లాబ్ ఎగ్జామ్ కి వెళితే....తనకి బాగా హెల్ప్ చేసారంట...మొహం బాగా చిన్నబోయి వుంది మంజు నాకు మాత్రమె కాదు అందరికి చాలా బాగా హెల్ప్ చేసారు ఈ రోజు అని చెప్పింది...హాస్టల్ కి రాగానే...ఇప్పట్లా అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కదండీ వెంటనే చెప్పడానికి....!!
అలా మొత్తానికి అప్పుడు నా లాబ్ పోయింది....తరువాత వెళ్ళినప్పుడు ఆ సారే చాలా చక్కగా మాట్లాడారు లాబ్ లో....అప్పుడు నేను కుడా ముందు ఏమి అడగలేదు మొత్తం చేసి ఫైనల్ గా చూపించాను....మద్యలో వచ్చినా..నా పని నేను చేసుకున్నాను..తప్ప ఏమి అడగలేదు...!! వైవా కుడా బాగానే అడిగి పంపేసారు....!!
ఉహించని మార్పు అది...!! ఇలాంటివి ఇంకా కొన్ని కబుర్లు మళ్లి ఎప్పుడైనా...!!
మనిషి అన్నవాడు ఎప్పుడో ఒకసారి తప్పుని ఒప్పుకుని కాస్త మారితే...చాలా ఇబ్బందులు తప్పుతాయి అందరికి...!! నాకు అన్ని తెలుసు వీళ్ళ మాట నేనెందుకు వినాలి అని కాకుండా తప్పు ఎక్కడ వుంది అని కాస్త తరచి చూసి మార్చుకుంటే...అందరు మంచివారే....!!
వర్గము
కబుర్లు
1, నవంబర్ 2012, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)