30, మే 2012, బుధవారం

ఆమె..!!

అమ్మగా ఆలిగా
అక్కగా చెల్లిగా
హితురాలిగా
సన్నిహితురాలిగా
స్నేహితురాలిగా
ఆత్మీయురాలిగా
అలసిన వేళ ఆలంబనగా
నీ తప్పులలో నీ ఒప్పులలో
అన్నింటా తోడూ నీడగా
నీతోనే తన ప్రపంచమనుకున్న
ీవకళను జీవం లేని శిలను చేసి
ఆమెను నిర్లక్ష్యం చేయ తగునా...!!

29, మే 2012, మంగళవారం

గుండెకు గాయం..!!

గాయం చేసేది మనిషి
గాయపడేది మనసు
గాయానికి మందు కాలం...
కాలం తెచ్చే మరపు....!!
గుండె ముక్కలైతే...!!
గాయం మానుతుంది కాని...
ముక్కలైన గుండె అతికినా
అది అతుకుల బొంతే..!!

28, మే 2012, సోమవారం

మనవి సక్రమ ఆస్థులా..!!

అక్రమ ఆస్థులు అని గోల పెడుతున్నారు ఇంతకు ముందు అవి ఆక్రమ సంపాదన అని గుర్తు రాలేదా!! అందరూ లాభం పొందిన వాళ్ళే కదా ఈ రోజు జగన్ ఒక్కడే దోషి అని అంటున్నారు...!! మనకు లాభం వస్తే వాళ్ళు ఎలాంటి వెధవలయినా చాలా మంచోళ్ళు....మనకు ఎదురు తిరిగితే మాత్రం దోషులు...!!
ఒక్క జగన్ వి మాత్రమే అక్రమ ఆస్థులా...!! మిగిలిన అందరివి సక్రమ ఆస్థులా..!! మరి చట్టం తన పని తను చేసుకు పోడం లేదెందుకో....!! సారా అమ్ముకోవచ్చు...ఇసుక దందాలు చేయవచ్చు....హత్యలు చేయించ వచ్చు...సెటిల్మెంటులు చేయించ వచ్చు అవి అన్ని క్రమ సంపాదనలే..!! మీ అడుగులకు మడుగులు ఒత్తితే క్రమమే అంతా...!! లేక పొతే అన్ని తప్పులు...!! అప్పటి ఒప్పులు ఇప్పుడు తప్పులు....!!
అమ్మగారికి అప్పుడు గుర్తు రాలేదా లేక తెలియలేదా వేల వేల కోట్లు ఎలా వస్తున్నాయో అని..!! పార్టి పెట్టి సొమ్ము బాగా చేసుకుని విలువలను, విధానాలను గాలికి వదిలేసి మీ పంచన పదవి కోసం చేరితే అబ్బో....చాలా మంచివాడు..!! మొన్ననే కదా మరి అల్లుడి ఇంట్లో సొమ్ము దొరికింది మరి దానిపై ఏ మాటా!! లేదు....అందరూ మర్చిపోయారు కూడా..!! అవును కదూ అవి అన్ని సక్రమ ఆస్థులు కదా అందుకే వాటి లెక్కలు అక్కరలేదు...!! అయినా పరాయి వాడేమి కాదు కదా..!! మనవాడే మనం ఎంత చెప్తే అంత..!!
ఈ రోజు రాజకీయాల్లో ఉన్న అందరివి సక్రమ ఆస్థులు...!! సక్రమ సంపాదన....!!
యధా రాజ తదా ప్రజా లెక్కన ఉన్నాం ఈ రోజు ప్రజాస్వామ్యంలో...!!
ఎవరి మనస్సాక్షి కి వాళ్ళకే తెలుసు మనం ఒకళ్ళని అనే ముందు మనం ఏంటో..!! చూసుకోవాలి...!!
ఒక జగన్ కానివ్వండి,,ఒక రాజశేఖర రెడ్డి కానివ్వండి మన అవసరానికి వాళ్ళని వాడుకున్నాము మనము తిన్నాము వాళ్ళు తిన్నారు...కాదంటారా..!!
కేసుల్లోనుంచి బయట పడ్డాము మన తప్పులు కప్పారని ఈ రోజు వాళ్ళని అనకూడదు...!!
జనాల సొమ్ము తినని.. ఒక్క నాయకుడిని చూపించండి...!!
తప్పు మనదే..!! మనం ఎన్నుకునే క్రమం లోనే మోస పోతున్నామో లేక ఏ రాయి అయితే ఏంటిలే పళ్ళు ఊడగొట్టుకోవడానికి అని సరిపెట్టుకుంటున్నామో...!!
కనీసం ఇక నైనా ప్రతి ఒక్కరు ఓ క్షణం ఆలోచిస్తే కాస్త అయినా ప్రయోజనం ఉంటుందేమో..!!

27, మే 2012, ఆదివారం

నువ్వే...నేనైతే..!!

నీ గుప్పెడంత గుండెలో నేనే...!!
నీ మది తలపుల సవ్వడిలో నేనే..!!
నీ మనసు ముంగిట దోబూచులాడేది నేనే..!!
నీ ఏకాంతంలో అలజడి రేపేది నేనే..!!
నీ ఒంటరితనంలో ఆలంబన నేనే..!!
నీ ఆలోచనా తరంగపు అలను నేనే..!!
నీ అన్వేషణా గమ్యం నేనే...!!
నీదంతా నేనే అయినప్పుడు నా సర్వమూ...నువ్వే..!!

26, మే 2012, శనివారం

జవాబు లేని ప్రశ్న..!!

మరణం....!!
జీవితానికి రాజీనామా..!!
మరో జన్మకు పయనం...!!
మరణం లో ప్రశాంతత మరెక్కడా దొరకనిది...!!
వేదన నుంచి విముక్తి...!!
బంధాల నుంచి విరక్తి....!!
అందుకేనేమో...!!
ఒక్కోసారి మరణానికి ఆహ్వానం పలుకుతాము...!!
మరణం అంచుల వరకు వెళ్లి మళ్ళి వెనక్కు వస్తే...!!
అది పునర్జన్మేమో..!!
అదృష్టమో...!!
మరి దురదృష్టమో..!!
దేవునికి మనతో పని ఉన్నదో ఏమో..!!
లేక మన ఖర్మ ఇంకా మిగిలిందేమో...!!
అనుభవించడానికి..!!
జవాబు తెలియని ప్రశ్నగానే మిగిలి పోయింది...!!
ఈ జీవితం...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner