24, ఆగస్టు 2012, శుక్రవారం

బంధీ.....

బంధాలకు బంధిని  
అనుబంధాలకు దాసోహం
బాధ్యతలకు బానిసను
అనురాగానికి అభిమానానికి
ఎప్పుడూ మనసు  అనుసంధానమే..!!!
 

4, ఆగస్టు 2012, శనివారం

స్నేహితులరోజు శుభాకాంక్షలు

స్నేహానికి విలువనిచ్చే స్నేహితులందరికీ స్నేహితులరోజు శుభాకాంక్షలు

2, ఆగస్టు 2012, గురువారం

గుర్తు వచ్చే....!!!


ఉలికి పడే నిజాన్ని
ఎగసి పడే అలలని
పడినా లేచే కెరటాల్ని
చుట్టుముట్టే ఆలోచనల్ని
అల్లుకునే ఊహలని
దోబూచులాడే రూపాన్ని
పారాడే పాదాలని
రెప్ప వేయని కనుపాపలని
ఎవరిని పలకరించినా....
గుర్తు వచ్చేవి నీ జ్జ్ఞాపకాల దొంతరలే...!!

31, జులై 2012, మంగళవారం

ఎలా దరి చేరినా....!!

చినుకులా రాలినా....
చిరుజల్లులా సేదదీర్చినా...
వానలా వర్షించినా....
వరదలా ఉప్పొంగినా....
మలయమారుతంలా చుట్టుముట్టినా...
జలపాతంలా జాలువారినా....
ఎలా వచ్చినా...ఎటునుంచి చేరినా....
అది నీ సన్నిదే....!!

18, జులై 2012, బుధవారం

అందరికి అభివందనాలు..!!

ఎప్పటి నుంచో...చదివిన చందమామ, బాలమిత్ర కధలు.. రాధాకృష్ణ నుంచి చదవడం మొదలు పెట్టిన వారపత్రికలలో సీరియల్సు ఇలా చదివి చదివి ఒకసారి ...
కోపాన్నికధగా రాసినప్పుడు అక్కలు చూసి నీ కధే రాసావే...!! అంటే అయ్యో వీళ్ళకెలా తెలిసిపోయిందబ్బా...!! ఆని బోల్డు ఆశ్చర్యం ..!! నేస్తాలకి ఉత్తరాలతో రాతలు రాయడం మొదలు....మద్య మద్యలో కవితలు...అలా మొదలయ్యి ఇప్పటి కాలానికి ఇ మెయిల్స్ తో సరిపెడుతూ...ఇదిగో...ఇలా బ్లాగు...టపాలు...నా రాతలు సాగుతూ వున్నాయి.
బ్లాగు మొదలు పెట్టి మూడున్నర్ర ఏళ్ళు అయినా రాతలు మొదలెట్టి మూడు ఏళ్ళు అనుకుంటా..!! మొదట్లో అందరి బ్లాగులు చూస్తూ ఆమ్మో భలే బాగా రాసేస్తున్నారు బోల్డు మంది చూస్తున్నారు...నాది అస్సలు ఒకరైనా చూస్తారో లేదో ఒక్క కామెంట్ అయినా టపాకి వస్తుందో రాదో అని అనుకునేదాన్ని...నాకు అనిపించింది రాయోచ్చో లేదో అని అనుమానమే..!!
భయపడినా మొత్తానికి రాయడం ఆపలేదు...అలా మొదలు పెట్టిన రాయడం ఇప్పటికి ఆవి ఇవి అన్ని....ఈ టపాతో పాటుగా కలిపి ఓ మూడు వందల టపాలు నా బ్లాగులో చేరిపోయాయి....!!
చెప్పలేని సంతోషమయినా...
తట్టుకోలేని బాధయినా...
పంచుకోగలిగిన ప్రియ నేస్తం....!!
ఆదరించే అమృత హృదయాలు....
ఓదార్పునిచ్చే పన్నీటి పలుకులు....
ముఖ పరిచయం లేకుండా....
మనసు తెలుసుకునే నేస్తాలు....!!
ఏది రాసినా...ఎలా రాసినా...!!
బావుందనే... మెచ్చుకోలు...!!
ఆదరిస్తున్న అందరికి అభివందనాలు..!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner