30, నవంబర్ 2016, బుధవారం
నాకంటూ లేక పోయినా....!!
గోడ మీద నెత్తుటి చారఇంకా తడిగానే ఉంది
నిష్క్రమించిన జీవితానికి సాక్షిగా
తవ్వకాల్లో బయల్పడిన శేషాలు
ఊపిరి పీల్చుకుంటున్నాయి
ఈసారికి దొరకలేదన్న ధీమాతో
బాహ్య ప్రపంచానికి తెలియని
అంతరంగం తొంగి చూస్తోంది
ముక్కలైన మనసు రోదనను
లెక్కలు తేల్చని పైవాడు
చిద్విలాసంగా నవ్వుతున్నాడు
నా ఆటలో పావులు మీరంటూ
వేచి చూస్తాను యుగాల నిరీక్షణలో
నాదైన ఓ క్షణ కాలం కోసం
వేల క్షణాలు నాకంటూ లేక పోయినా....!!
వర్గము
కవితలు
27, నవంబర్ 2016, ఆదివారం
వెదుకులాటల్లో...!!
అపసవ్యంగా పడుతున్న అడుగులుగమనాన్ని నిర్దేశిస్తున్న గతుకులు
కనురెప్పల చాటున దాచుకున్న కన్నీళ్ళు
చేజార్చుకున్న జీవితాల కథనాలు
స్థానభ్రంశం చెందుతున్న అక్షరాలు
మరలిన కాలాన్ని మోస్తున్న జ్ఞాపకాలు
వెక్కిరిస్తున్న శిథిల శేషాల అవశేషాలు
అలసిపోయి ఆగిన క్షణాల గురుతులు
ఎప్పటికి కరగని బాల్యపు శిలాశాసనాల సందళ్ళు
ఘనీభవించిన గత చిహ్నాల వెదుకులాటల్లో...!!
వర్గము
కవితలు
23, నవంబర్ 2016, బుధవారం
గుట్టు బయటపడిన రోజు...!!
నేస్తం,మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్న విషయమే అయినా మళ్ళి మళ్ళి మాట్లాడాల్సి వస్తోంది. మనం ఏదైనా పోస్ట్ కానీ బొమ్మ కానీ పెట్టినప్పుడు దానిపై వచ్చే విమర్శలకు, అభినందనలకు వెరసి స్పందనలకు మనమే బాధ్యులం అవుతాము కదా.. మనకు నచ్చిన వాటికి తిరుగు సమాధానాలిస్తూ, నచ్చని స్పందనలను తీసేయడం ఎంత వరకు సమంజసం..? ఆ మధ్యన కూడా నేను ఒక విషయం గురించి రాసినప్పుడు ఒకావిడ వేరే వాళ్ళ మీద తనకున్న అక్కసునంతా కొందరి సలహాతో వెళ్ళగక్కి .. తాను అనుకున్నట్టుగా నా నుంచి సమాధానాలు రాకపోయే సరికి తన స్పందనలు మొత్తం తీసేసింది. ఈరోజు ఓ ఫోటోకి రెండు స్పందనలు పెడితే పెట్టిన మరుక్షణమే తీసేసారు. తమకు నచ్చని కామెంట్స్ పెడితే తీసేయడం ఎంత వరకు కరెక్ట్. మన ఫోటో మనం పెట్టుకుంటే తప్పు లేదు వేరే వాళ్ళది మనతో కలిసి ఉన్నప్పుడు పెట్టె ముందే వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని పెట్టాలి లేదా మన వరకు పెట్టుకోవాలి అంతే కానీ మనం కనిపించేటట్టు పెట్టి పక్కన వాళ్ళని కనపడకుండా చేసి పెట్టడం సంస్కారం అనిపించుకుంటుందా..? అలా కనపడకుండా పెడితే అందరు అడగకుండా ఉండరు కదా.. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే మనం కనిపించం అక్కడ -:)
ఇంకో కేటగిరీ వాళ్ళేమో రెండు మనసుల చిత్ర సరాగాలుగా చిత్ర సందేశాలు "నువ్వక్కడ నేనిక్కడ .... " అంటూ వగైరా వగైరా సందేశాలు .. ఇవి అన్ని వయసు పైబడిన వాళ్ళ ఆటలు ఈ ముఖ పుస్తకంలో. మరి వీళ్ళకు ఇంట్లో లేనిది ఇక్కడ ఏం దొరుకుతుందో.. ఇక మరికొంతమందేమో అన్నయ్య గారు / అక్కయ్యగారు అంటూనే కొంపల్లోనే కాకుండా స్నేహితుల మధ్యన కూడా నన్ను పిలిచారు నిన్ను పిలవలేదా అంటూ చిచ్చు పెడతారు. వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడం కోసం ఎన్నో వేషాలు వేస్తూ ఉంటారు ఈ ముఖ పుస్తకం వేదికగా. ఇంట్లో తమ బంధాలు ఉన్నా వారిని నిర్లక్ష్యం చేస్తూ మరి ఈ విపరీత ధోరణులు ఎందుకు అన్నది వారికే తెలియాలి. ఈ చాటుమాటు వ్యవహారాలు ఎన్నో రోజులు దాగవు. నిలబడవు కూడాను. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడటం లేదులే అని సరిపెట్టుకుంటే ఎలా .. గుట్టు బయటపడిన రోజు మీ నైతిక విలువ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అన్ని తెలిసినా మౌనంగా ఉంటుంటే అది చాతకానితనంగా తీసుకోవద్దు. మీలో మార్పు కోసం మీకోసం ఎదురుచూసే మనిషిని మీరు గుర్తిస్తారేమో అన్న చిన్న నమ్మకం. దయచేసి దాన్ని నిలబెట్టుకోండి, మీ గౌరవాన్ని కాపాడుకోండి.
వర్గము
కబుర్లు
22, నవంబర్ 2016, మంగళవారం
సాగర సంగమం...!!
నేస్తం,
ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్న నాలుగు మాటలు. నాకు బాగా నచ్చిన సాగర సంగమం సినిమా గురించి. నేను ఏడవ తరగతి చదివే రోజుల్లో వచ్చింది. అప్పట్లో పాటలు అంటే బాగా ఇష్టం , ఇప్పుడు కూడా పాటలు ఇష్టమే. పాటల పుస్తకాలు కొని మరీ పాడిన పాటలు బోలెడు. ఎన్నిసార్లు చూసినా మళ్ళి మళ్ళి చూడాలనిపించేంత ఇష్టమైన సినిమాల్లో ఈ సాగర సంగమం ఒకటి.
విశ్వనాధ్ గారు ఎలా తీశారో కానీ ఓ జీవితాన్ని సంపూర్ణంగా చూపించారు అనడానికి ఈ సినిమా ఒక్కటే అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి సాక్ష్యం. స్నేహం అంటే ఏమిటో, ప్రేమ, ఆరాధన, కోపం, ఆవేశం... ఇలా అన్ని రసాలు మేళవించి ఒక వ్యక్తికి ఆపాదించడం అంటే సామాన్య విషయం కాదు. ఇష్టమైన కళకు జీవితాన్ని అంకితం చేసి దానిలోనే తన హృదయాన్ని దాచుకున్న ఓ అద్భుత వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది. కమల్ కనిపించరు నాకు ఈ సినిమాలో బాలునే కనిపిస్తారు. అమ్మ కోసం ఓ కొడుకు తన చిరకాలపు జీవితపు కలను సాకారం చేసుకోకుండా అమ్మకు అంకితం చేయడం, అవమానాన్ని భరించడం, ఓ తల్లి కూతురు మధ్య అపార్ధాలు .. ఇలా ఎన్ని చెప్పినా తక్కువే.
పాటల్లో సహజత్వం, వేదం అణువణువున నాదం ... తకిట తధిమి తందానా ... ప్రతి పాట ఓ ఆణిముత్యమే. సహజత్వంతో సహజాతంగా మనకు అందిన అపురూప చిత్ర రాజం " సాగర సంగమం ".

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)