చే...జారి పోయిన జీవితమని తెలిసినా...!!
జరుగుతున్న వాస్తవం
నిజమని తెలిసినా...!!
జరగబోయే వర్తమానంలో
చేదు నిజాలున్నాయని తెలిసినా....!!
అంతరంగపు అలల కల్లోలంలో
ఊహల్లో వాస్తవాలు భయపెడుతుంటే
జ్ఞాపకాల్లో బతకలేక
వాస్తవానికి దగ్గర కాలేక
రాజి పడలేని నిరాశాజీవి
అటు ఇటు పోలేక
ఎటు పోవాలో అన్న అయోమయంలో
అక్కడే ఆగిపోతే....!!
చే జారి పోయిన జీవితాన్ని
తిరిగి దక్కించుకునే ప్రయత్నంలో
అదరక బెదరక అవిశ్రాంతంగా
నిరంతర పోరాటంలో ఆశాజీవి...!!
5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
chalaa baagundandi
Thank u Ramesh garu
నాకు చాలా నచ్హింది. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను.
నాకు చాలా నచ్హింది. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను.
Thank u so much Anu garu
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి