12, ఆగస్టు 2013, సోమవారం
కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి.....!!
ఇప్పుడే అందిన తాజా వార్త...!! ఒకప్పుడు ఉల్లి కోస్తే ఆ ఘాటుకి కన్నీరు వచ్చేది....మరి ఇప్పుడో...!! ఉల్లిని తలచుకుంటేనే కన్నీరు కారి పోతోంది. ఉల్లి ధర కూడా పై పైకి వెళ్ళి అందనంత దూరంలో కూర్చుంది....ఒకప్పుడు ఎనిమిది రూపాయల ఉల్లి రాను రాను పెరిగి పదై, పన్నెండై, ఇరవై.... ముప్పై అయి ఒక్కసారిగా యాభై నుంచి డెబ్బై కి చేరింది ఇప్పటికి... పచ్చి మిరపకాయల కారం ఇంతకు ముందే వందకు చేరి చేతికి అందకుండా పోయింది...పెట్రోలు రోజుకి రెండు సార్లు పెరుగుతూ ఉంటే....అదే తీరుగా ఎప్పుడు కనిపించని కరంటుకి చక్ర వడ్డీ కడుతూ... ఇలా నిత్యావసరాలు ఒక్కొకటిగా ఎదిరి ఆకాశంలో చుక్కల పక్కన కూర్చుంటుంటే తల ఎత్తి అందని ఆకాశాన్ని చూస్తూ చుక్కలనంటిన ధరలను తల్చుకోవడమే...!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ప్రభుత్యం ప్రతి పంట కు మద్దతు ధర ప్రకటించి రైతును ఆదుకుంటే అప్పుడు రైతు పంటను పండించటానికీ ముందుంకు వస్తారు
నిజమే అండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి