7, ఆగస్టు 2013, బుధవారం
నేను నీకు తెలుసు... నువ్వు నాకు తెలుసు.....!!
నేనేంటి అన్నది నాకన్నా నీకే బాగా తెలుసు....మళ్ళి నన్ను అడుగుతావెందుకు...?? అప్పుడప్పుడు నీతో పోట్లాడుతూ కూడా మరో వైపున సంతోషిస్తూ ఉంటా.... ఎందుకనుకుంటున్నావా...!! అలా అయినా కాసేపు నీ మనసు నా వైపు మళ్ళుతుందని...!! అంతర్నేత్రం లో నుంచి చూసినా కూడా నువ్వే కనిపిస్తున్నావాయే...!! అందుకే ఇలా అప్పుడప్పుడు నా మనసుని నీతో పంచుకుంటూ ఉంటా....అది సంతోషమైనా...బాధైనా...నీకు చెప్తే నాకు స్వాంతన. ఎందుకో మరి నీతో ఇలా చుట్టుకుపోయింది చుట్టరికం. అది ఎంత వరకు...ఎప్పటి వరకు అన్నది నాకు తెలియదు మరి...!! నా ఊహలు, ఊసులు నీకు కబుర్లుగా చెప్పినా, కధలుగా చెప్పినా, కవితలల్లినా....ఎలా చెప్పినా వింటావు. అందుకే నువ్వు నాకు ప్రియ నేస్తానివి అయిపోయావు...విడలేని బంధంగా పెనవేసుకున్నావు. ఎక్కడి వరకో మరి ఈ పయనం....!! ఎప్పుడు పిలిచినా పలుకుతావు...నాతోనే ఉంటూ నన్ను నేను చూసుకునేటట్లు చేస్తున్నావు. మనసు ఘర్షణలో పాలుపంచుకుంటున్నావు. నీతో చెప్పి నేను బరువు దించుకుంటున్నాను. మరి నువ్వెలా ఉన్నావో ఈ భారాన్ని భరిస్తూ....!! నా మనసుకు నువ్వేది చెప్తే అదే మళ్ళి నీకు చెప్తూ పునరావృతం చేస్తున్నానేమో అని అనుకుంటూ కూడా మళ్ళి నీకు చెప్పకుండా ఉండలేని నా బలహీనత చూసి నవ్వుకుంటున్నావా...!! ఏం చేయను మరి...నువ్వు చెప్పమన్నదే నీకు చెప్తే నాకు ఆనందం...!! నువ్వు చెప్పకుండా నాకు ఏం తెలియదు కదా....!! అంతగా మమేకమైన మనం నువ్వు నేను కాదు...నువ్వే నేను... నేనే నువ్వు....అందుకే నేను నీకు తెలుసు... నువ్వు నాకు తెలుసు.....!! నా ఎదురుగా అద్దంలో కనిపించే నువ్వా ...!! ఇంతకీ నువ్వెవరు...?? నేనెవరు...??
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
నువ్వెవరు .. అంటే .. బ్లాగ్
నేనెవరు ..అంటే... బ్లాగర్ or అక్షరం
అవునా ..!? మంజు గారు
మీకు తెలియని సమాధానమా....!!
వనజ గారు..... -:)
నాకు తెలుసులెండి :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి