12, ఆగస్టు 2013, సోమవారం

ఆంధ్ర రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలుగా విడి పోనుందో...!!


తెలంగాణా ఇస్తే సీమాంద్ర ఉద్యమాలు...ఇవ్వకపోతే తెలంగాణా పోరాటాలు చేస్తూ జనాలు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు తప్ప....నాయకులు హాయిగా ఉన్నారు. ఏది చేసినా నాయకులు ఇబ్బంది పడితే తప్ప పరిస్థితిలో మార్పేం ఉండదు. ఉభయ సభలు పోట్లాటలతో వాయిదా పడటం తప్ప ఒరిగేదేం లేదు. రాజీనామాలు, నిరసనలు తప్ప ప్రజా సమస్యలు ఎవరికీ అక్కరలేదు...ఈ రోజు తెలంగాణా... రేపు రాయలసీమ.... ఎల్లుండి ఉత్తరాంధ్ర... మరి ఎన్నిరాష్ట్రాలు రాష్ట్రంలో ఏర్పడనున్నాయో...!! అభివృద్ధి లో అందరు వెనుకబడినవారే మరి...!! ఎవరి ప్యాకేజీలు ఎంతో తేల్చుకోండి....!!

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Jai Gottimukkala చెప్పారు...

రెండో మూడో (ఆంద్ర, రాయలసీమ & కళింగ?) మాకెందుకు లెండి. తెలంగాణా వచ్చాక ఆంద్ర ఎన్ని ముక్కలయినా మాకు సంతోషమూ లేదు, బాధా కలగదు

hari.S.babu చెప్పారు...

1. ఒక సమస్యకి పరిష్కారం అనుకున్నది కొత్త సమస్యల్ని సృష్టించేదిగా ఉంటే, కొంతకాలం తర్వాత మళ్ళీ సమస్య మొదటికొస్తుందేమో అనిపించేటట్లు ఉంటే అది నిజమైన పరిష్కారం అనిపించుకుంటుందా? ఇప్పుడు ప్రత్యేక తెలంగణా రాష్ట్ర ప్రతిపాదన మొదలవ్వగానే గుర్ఖాలాండు గొడవ మొదలు పెట్టింది. మిగతా వాళ్ళు కూదా నేడో రేపో మొదలు పెదతారు.నిజంగా విభజన వల్లనే వెనుకబటుతనం పోతుందా? ఇప్పటికి ఉత్తరాదిన విడిపొయిన రాష్ట్రాలలో అలాంటి గుణాత్మకమైన మార్పులు జరిగాయా?

2. తెలంగాణా వాదులకి తెలుసో లేదో గాని విభజన నిర్ణయం జరిగాక సమైక్యాంధ్ర ఆందోళనల వెనక రాష్త్ర స్థాయి కాంగ్రెసు పెద్దలే ఉన్నారనేది యెమి చెబుతున్నది? ఇస్తారేమో అన్నప్పుదు హడావుడి చెసి ఇవ్వరని ధీమాగా ఉన్నప్పుదు ఆగిపోవటంలా నత్త నదక నడిచే ఉద్యమానికి చురుకు తెప్పించటం కొసమే వాళ్ళు ఈ ప్రకటన చేసారు. దాన్ని వేడెక్కించి ఆ బూచిని చూపించి విభజనని యెన్నికల తర్వాతకి వాయిదా వెయ్యటం కోసం అక్కడి పెద్దన్నలూ ఇక్కడి చిన్నన్నలూ కలిసి ఆడుతున్న దొంగాట ఇది.

3. అవును అది మాకూ తెలుసనే తెలంగాణా వాదులకి నేనొక సూటి ప్రశ్న వేస్తాను. ఇట్లాంటి కాంగ్రెసుతో కచరా గారు యెందుకంత మమేకమయ్యారో, రాష్ట్రం రావటమంటూ జరిగితే అది కాంగ్రెసు వల్లనే అని నొక్కి చెప్పారో నిన్న గాక మొన్న రాష్ట్రం ఇస్తే కాంగ్రెసులో కలిసి పోవడానికి గూడా సిద్దపడ్దారో మీరు తేల్చుకొవల్సి వొస్తుంది.

4. మొత్తం సమస్యని మొదటి నుంచీ చివరి వరకూ రాగద్వేషాల కతీతంగా చూస్తే అటు తెలంగాణా వాదులూ ఇటు సమైక్య వాదులూ చేస్తున్న పొరపాటు ఒకటి కనిపిస్తున్నది. సమస్యకి మూలం యేమిటో ఇద్దరిలో యెవరూ పసిగట్ట లేదు. ఒక సమస్యని మూలాన్ని వెదక్కుండా పైకి కనబడే చిహ్నాల్ని మాత్రమే చూసి మూలం దగ్గిర ఒక్క దెబ్బతో పడిపొయే విషవృక్షాన్ని ఆకుల మీద యెన్ని దెబ్బలేసినా లాభమేముంది?

5. తెలంగాణా వాదులకి తప్పనిసరిగా జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఒకటి వేస్తున్నా.ఇవ్వాళ మా వెనకబాటుతనానికి ఆంధ్రోళ్ళు కారణం, ఇన్నేళ్ళుగా మమ్మల్ని నిర్లక్ష్యం చేసారు గనక విడిపోవటమే సరైనదంటున్నారు. విడిపొయిన ఒక నాలుగేళ్ళ తర్వాత ఒక మూదు జిల్లాలు మాత్రమే ముందుకెళ్ళి మిగతావి ఇంకా వెనకబడి ఉంటే, వాళ్ళు ఇలాంటి వాదన తోనే మాకు వేరే రాష్త్రం కావాలని అడిగితే వెంటనే అప్పటి మీ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చేస్తారా?

hari.S.babu చెప్పారు...

6. అలా సాగదీస్తూ పోతే యెక్కడాగుతుంది? విదిపోవడం ద్వారానే బాగుపడగలగటం నిజమైతే ప్రతి జిల్లా ఒక రాష్తంగా విదిపోవాల్సి ఉంటుంది.నిజంగానే రాష్త్రం విడిపోకుండానే మీకు కావలసిన స్వయం పరిపాలన అనేది సాగించుకోలేని విషయమేనా? ఇవ్వాళ పరిపాలనకి సంబంధించిన చట్రం యెలా ఉంది?కేంద్రంలో పార్లమెంటూ రాష్త్రాలలో అసెంబ్లీలూ ఉద్దరిస్తున్న ఘనకార్యమేమిటి? కేవలం కాగితాల మీదకి శాసనాల్ని యెక్కించటం. వాళ్ళు నిజంగా పనులు చెయ్యటానికి జిల్లా స్థాయి యంత్రాంగం మీదే ఆధార పడుతున్నారు.యెందుకంటే జిల్లాలకి భౌగోళికమైన,రాజకీయపరమైన మరియు సాంస్కృతికమైన సరిహద్దులు ఖచ్చితంగా వివాద రహితంగా యేర్పాటయి ఉన్నాయి.పనులు చెయ్యటానికి కావలసిన యంత్రాంగమంతా అక్కడ బలంగా ఉంది.

7. ఆ జిల్లాలకి రాజకీయపరమైన స్వయం పరిపాలన ఇవ్వడం కొసమే జిల్లా ప్రజా పరిషత్తులనే వ్యవస్థని ప్రతిపాదించారు. వాటికి యెన్నికలు జరుగుతున్నాయి,కార్యాలయాల్ని సమకూర్చారు, చాలా హడావుడి చేసారు - అఖరికి ఇవ్వల్సిన శాసనాధికారం మాత్రం ఇవ్వకుందా చేటపెయ్యల్లాగా వాటిని నిలబెట్టినందువల్ల ఆ యెన్నికలకయ్యే ఖర్చంతా వృధా అయిపోతున్నది. అవి అసమర్ఢులకి రాజకీయ పునరావాస కేంద్రాలు గా మిగిలిపొయినాయి.

8. తెలంగాణా వాదులు ఆ పది జిల్లల కోసమూ, సమైక్య వాదులు ఆ హైదరాబాదు ఒక్కదాని కొసమూ గాకుండా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి కోసం ఉమ్మడిగా పోరాడితే మొత్థం 23 జిల్లాల వాళ్ళూ బాగుపదతారు కదా! అధికార వికేంద్రీకరణ కోసమనే ఒక వ్యవస్థని ప్రతిపాదించి కూడా దాన్ని పూర్తిగా యెందుకు అమలు చెయ్యలేదో తెలుసా?అధికారం కేంద్రీకృతమవడం వల్ల లాభపడే వాళ్ళు ఆ అధికారాన్ని వికేంద్రీకరిస్తే తమ లాభం గూబల్లోకి వొస్తుందని తెలియదం వల్ల అలా వికేంద్రీకరణని తొక్కి పట్టి ఉంచారు.రెండు రాష్ట్రాలు గా విడిపోతే ఇలాంటి అధికార కేంద్రం దగ్గిర గుమిగూడి సొంతానికి దండుకునే వాళ్ళు మాత్రమే బాగుపడతారు.

9. అవినీతి మచ్చ లేని వాళ్ళూ మంత్రులు గా కొందరు మంచి పేరు తెచ్చుకున్న మంచి వాళ్ళూ తమ జీవితానుభవాల్ని గురించి చెబుతూ వాళ్ళు జిల్ల పరిషత్ చైర్మన్లు గా ఉన్నప్పటి అనుభవాల్ని యెకరువు పెట్టగా నేను చదివాను.అనుభవాలు అంటే పని చేసిన అనుభవాలు కాదు - జిల్లా అంతా కలయ దిరిగి యెమి చెయ్యాలో తెలిసి కూదా పని చెయ్యటానికి అధికారాలు లేని దరిద్రాన్ని గుర్తు చేసుకోవటమే. మంత్రిగా ఉన్నప్పటి అధికారాలు అప్పుడే ఉంటే యెంతో కాలం కలిసొచ్చేదనే నిట్టూర్పులే.ఇవ్వాళ ఇంకొ దరిద్రం కూడా కనబడుతూ వినబడుతూ ఉంది. వెనకబడిన జిల్లాల వాళ్ళు రాష్త్ర ప్రభుత్వాల్ని మేము కాస్త బాగుపడాలి బాబూ మా జిల్లా నించి ఒకరిని మంత్రిని చెయ్యండని దేబిరించటం.అంటే ఒక జిల్లా బాగుపడాలంటే ఆ జిల్లా వాడు మంత్రివర్గంలో ఉండాలన్నమాట. అంటే మొత్తం ర్రాష్త్ర పరిధి లో అలోచించాల్సిన మంత్రి తన సొంత జిల్లాని గురించి మాత్రమే అలొచించటం అనేది అందరికీ న్యాయమే అనిపిస్తున్నదన్నమాట.

10. ఆ దరిద్రాలకీ ఈ శషభిషలకీ మూలం ఒక్కటే ననేది నాకు అనిపిస్తున్నది. జటిలమైన సమస్యలకి కూడ లోతెరిగి చూడకుందా దీర్ఘకాలిక పరిష్కారాలకి కాకుండా అప్పటికి నెత్తిన పడ్డ పెంటని వొదిలించుకుంటే చాలనే విధంగా అలోచించటమే.తెలంగాణా వాదుల కోరిక ప్రజలు సుఖపడే స్వయం పరిపాలన అయితే అది రాష్త్రంగా విడిఫొయినా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం వల్లనే జరుగుతుంది. జిల్లాలకు పూర్తి అధికారాలిచ్చి అన్ని జిల్లాలనీ స్వయం పోషకంగా చెయ్యడం విదిపోకుండానే చేసుకొవచ్చ్చు.కాదు మాకు వేరే అధికార కేంద్రం కావలసిందే తింటే తింటారు తిననియ్యుండ్రి మావాళ్ళేగా మేమేమీ అనం అంటే నేనేమీ చెప్పలేను. ఒకసారి నేనే ఆ జవాబును వారినుంచి పొంది ఉన్నాను:-)

hari.S.babu చెప్పారు...

ఇక ఆఖరుగా రెండు మాటలు చెప్పి నా వాదనని ముగిస్తాను.ఒకనాడు దేశం కొత్తగా స్వతంత్రం తెచ్చుకున్న రోజున భాషాప్రయుక్త రాష్త్రాల పేరుతో మనం ఒక ఒరవడి దిద్దాం. అదే దారిలో మిగతా వాళ్ళూ నడిచారు. ఇవ్వాళ మళ్ళీ అధికార వికేంద్రీకరణ సాధిస్తే మళ్ళీ మనం అందరికీ కొత్తదారి చూపించిన వాళ్ళ మవుతాం.నాకు చాలా బాధగా అనిపించే విషయం ఒకటి ఉంది. తెలంగాణా వాదులు మా భాష వేరు అంటున్నారు. అది చాలా తప్పు.మనం ఆ రొజున వేరే వాళ్ళకి వొదిలేసిన రాష్త్రాల్లో ఉన్న వాళ్ళతో సహా అందరం తెలుగు వాళ్ళమే. నేను క్రిష్ణా జిల్లా వాడినే అయినా రాగద్వేషాలు లేని నిందు మనస్సుతో ఒక మాట చెబుతున్నా. క్రిష్ణా జిల్లా నించి అధికార కేంద్రాన్ని అంటకాగి బాగా బలిసిన వాళ్ళు ఇతర జిల్లాల వాళ్ళని చాలా హీనంగా చూసారు, చూస్తున్నారు,ఇకముందు కూదా వాళ్ళు సంస్కారం గలిగి ప్రవర్తిస్తారని నేననుకోవదం లేదు. వాళ్ళీ రోజున మా భాష నీటైనది అనుకోవడం సంస్కృతం తో అవసరమైన దానికన్న యెక్కువగా సంకరం అవ్వడం వల్ల వొచ్చిందే. తెలంగాణా లో మాట్లాడేదీ, రాయల సీమలో మాట్లాడేదీ, అంధ్రా జిల్లాల్లో మట్లాడేదీ అంతా తెలుగే. అన్నీ మాండలికాలు మాత్రమే.అవి వాదుక ఈజీ గా ఉండడం కోసం యేర్పడిన యాసలు మాత్రమే. ఉపనిషత్తులలో శ్రేయము ప్రేయము అని ఒక భావన ఉంది. దాని అర్ధమేమిటంటే శ్రేయం కలిగించేది ఇష్టమైనది కూదా అయితే వెంటనే తీసేసుకో - నిన్నెవరూ అపలేరు కూడ. ప్రియమైనది శ్రేయము కాదని తెలిసినప్పుదు తొందర పడగూడదు. అలా తీసుకుంటే తర్వాత నష్టం నీకే. అలాగే ఒకటి మనకు శ్రేయస్సు నిచ్చేది అయితే అప్పటికి ఇష్టం లేకపోతే బలవంతంగా ఇష్టం కలిగించుకోవలసిందే, యెందుకంటే అది నీకు మంచి చేస్తుంది గనక.ఈ ఉపనిషత్తుల సుత్తిని నా స్వంత అవసరానికి వేస్తున్నానండీ యేమనుకోకండేం:-) పైన నేను చెప్పినవన్నీ నా వైపు నుంచి అన్ని జాగ్రత్తలూ తీసుకుని నా మాటల వల్ల అసలే వేడిగా ఉన్న వాతావరణం ఇంకా వేడెక్కని విధంగానే చెప్పినా తమకిష్టం లేని సంగతి కనబడ్దగానే నన్ను మాత్రం ద్వేషించకుండా ఉంటారని:-)


నా మనసులో ఉన్న అసలైన భవిష్యత్తు చిత్రపటం యేమిటంటే "జాతీయ స్థయిలో కేంద్ర ప్రభుత్వమూ ప్రాంతీయ స్థాయిలో జిల్లా ప్రభుత్వాలూ" మాత్రమే ఉండి అవి డైరెక్టు కాంటాక్టులో ఉండాలని. అసలు రాష్ట్రాలే అంతర్ధానమై పొవాలని. జిల్లాలకి అరకొర అధికారాలిచ్చి రాష్ట్రాలనే అంతరువులు అలాగే ఉంటే అవి మళ్ళీ ఇప్ప్పటి దళారి పనులే చేస్తాయి.


విభజనా? వికేంద్రీకరణా? యేది ఉత్తమం?

చెప్పాలంటే...... చెప్పారు...

హరీష్ గారు చాలా చాలా ధన్యవాదాలు మీ స్పందనకు ఇది చిన్న మాటే కాని అందరికి అన్నిటికి సమాధానం చెప్పింది మీ స్పందన....నాది నాకు వస్తే చాలు మిగిలిన వాళ్ళు ఏమైనా పర్లేదు అంటే మేము అంటే అనుకుంటాము అండి జై గారు

Jai Gottimukkala చెప్పారు...

@చెప్పాలంటే:

ఎవరి మంచి వారు చూసుకోవడం తప్పు కాదండీ. అయితే భవిషత్తులో వేరేవారికి ఏవో సమస్యలు వస్తాయేమో అనే బాధతో మనకు రావాల్సిన దాన్ని ఎవరూ వదులుకోరు.

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner