అన్న నమ్మకంతో...!! ప్రతిదీ వ్యాపార సంబంధమైన ఈ రోజుల్లో కీర్తి ప్రతిష్టలు పుష్కలంగా ఉన్నా....ధనం మూలం మిదం జగత్ అన్న నానుడిని అక్షరాలా పాటిస్తున్న పెద్దలకు పాదాభివందనాలు...!!
జలుబు చేసి కాస్త పేరున్న కార్పోరేట్ ఆసుపత్రికి అందుబాటులో ఉన్నది కదా అని వెళితే వాళ్ళకు అందుబాటులో ఉన్న అన్నిటెస్టులు ఒక వెయ్యి రూపాయలకు మాత్రమే రాసి పొద్దున్న వెళితే సాయంత్రానికి రిపోర్టుల్లో ఏమి లేదు అంతా బాగానే ఉంది అంటూ ఓ మూడువందల రూపాయల( పాపం తక్కువే మరి జలుబే కదా...!! ) మందులు రాసి పంపే వైద్య నారాయణులు ఉన్న సమాజమండి మనది...!! ఠాగూర్ సినిమాలోలా అన్నమాట....-:)
దేవుడి గుడిలో విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం పెట్టమని పేద్ద పేరున్న ఆస్థాన ఘనాపాటిని అడిగితే సొమ్ములు ఎంత కావాలో చెప్పి మంచి ముహూర్తంలో పూజలు చేయడానికి వారికి తీరిక లేక...విగ్రహ ప్రతిష్ట చేసిన జంటకు చావు ముహూర్తం పెట్టిన ఆ ఆచార్యులకు ఎన్ని సార్లు పాదాభివందనం చేసినా తప్పు లేదు...!!
గృహ ప్రవేశానికి ముహూర్తం పెట్టమని అడిగితే పాపం పైన చెప్పిన విధంగానే అసలు ముహూర్తమే లేకుండా పెట్టిన సుముహూర్తం....చవితి రాకుండానే చవితి పూజలు చేయించి తమ పని చేసుకుందామని మరొకరు....ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి...ఇదిగో ఇప్పుడు ఉన్న తెలంగాణా సీమాంధ్ర సమస్యలా అన్నమాట....!!
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మీ టపాకు తెలంగాణా సమస్యకూ సంబంధమెమిటో అవగతం కాలేదండి...
మనకు రోజు ఉండే సమస్యలు చాలవన్నట్టు ఇప్పుడు ఈ విభజన సమస్యను తెచ్చిపెట్టిన పెద్దావిడ అని... వేరే ఏ విధంగాను కాదండి
ఇది కూడా డబ్బులతోనే ముడి పది ఉండండి అందుకే జత చేసాను
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి