అర్ధ భాగాన్ని అర్ధం చేసుకున్నామన్న
అహంలో ఈనాటి తరం అమ్మాయిలు
నేను నా అన్న బంధాలను మాత్రమే
అదీ ఆర్ధిక అనుబంధాలుగా చేసుకుని
అసలు అనుబంధపు ఆనందానికి
సుదూరంగా వెళిపొతున్నామని
తెలియని మత్తులో ఆధునికత
మాయలో మునిగి తేలుతూ
ఆప్యాయతలకు అర్ధం వ్యర్ధమని
ఆర్ధిక సంబదాల అనుబంధం ఆసరాగా
మనము ఒకింటి అమ్మాయిలమని
మరచిపోయి అనురాగాలను కాలదన్నుకునే
ఈనాటి ఎందరో నాతులు నేతులలో
తేలుతున్నామని భ్రమలో అర్ధభాగాన్నే
కాలదన్నుతూ విద్య నేర్పిన వివేకానికి
వన్నెను చీకటి పరదాలుగా చేస్తూ
ఎందరో ఆత్మానుబందాలను బాధిస్తూ
అనంత దూరం చేస్తూ అమ్మాయిలోని
అమ్మను మరచిన అగత్యం విజ్ఞతనే
సవాలుచేస్తూ పక పకా నవ్వుతోంది......!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఆత్మ అనుబందం .... అనంత దూరం చేస్తూ
తనలోని అమ్మను మరచిపోవాల్సిన అగత్యం విజ్ఞతను సవాలుచేస్తూ పక పకా నవ్వుతూ ....
నేటి యువత
చక్కని సామాజిక అభివర్ణన
అభినందనలు మంజు గారు
ధన్యవాదాలు చంద్ర గారు చక్కని మీ స్పందనకు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి