మౌనంగా తారాడుతున్నాయి
ఎటూ పోలేక అక్కడే తచ్చాడుతూ
నువ్వెప్పుడు పలకరిస్తావా అని......
చూశావా దూరం కూడా అలానే ఉంది
నువ్వెప్పుడు దాన్ని దూరం చేస్తావో అని
భయపడుతూ నన్ను భయపెడుతోంది
నేనెక్కడికి పోను అని అడుగుతూ...
మాటల గల గలల్ని మౌన సమీరాలుగా
మార్చి తరిగే దురాన్ని మరింత పెంచుతూ
నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ
నన్ను మాయ చేయడం తగునా.....!!
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
సూక్స్మంలో మోక్షాన్నందించినట్లున్నది .
చక్కగా వున్నది కవిత , కన్నియ .
dhanyavaadaalu sharma gaaru
నేనెక్కడికీ పోలేను అని అంటూనే .... మాయ మాటల మౌన సమీరాలతో తరిగే దురాన్ని పెంచుతూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నన్ను మాయ చేయడం తగునా.....!
సమాజం లో సహజం గా పెరిగిపోయే దూరాలు కారణాల విశ్లేషణతో నిండిన ప్రయోజనాత్మక భావనావిష్కరణ
చాలా బాగుంది
అభినందనలు మంజు గారు!
మీకు నా మనఃపూర్వక ధన్యవాదాలు అండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి