1. విసుగు రావడంలేదెందుకో_భేషజాల్లేని చెలిమి మనదని కాబోలు...!!
2. బాసలక్కరలేని బంధమే మనది_పది కాలాలు పదిలమంటూ...!!
3. ఆహ్లాదంగా హత్తుకుంటున్నా_చినుకుల చిరునవ్వులను...!!
4. గమనానిదెప్పుడూ వెలుగు బాటే_తప్పటడుగులెన్ని వేసినా..!!
5. వన్నెలన్నీ చిన్నబోతున్నాయి_వెన్నెలంత స్వచ్చమైన మన స్నేహాన్ని చూసి...!!
6. జ్ఞాపకం ఓదార్చింది_మౌనం గాయపడితే... !!
7. జీవితాన్ని నిలబెట్టింది_ఆలంబనగా నిలిచిన నీ ప్రేమ...!!
8. వెలుగు రాదారిని పరిచా_క్రీనీడలకు తడబడకు నేస్తమా...!!
9. సంతసాల అతిశయమే_ ఆత్మీయతానుబంధానికి దక్కిన గౌరవానికి...!!
10. అద్దంలో ప్రతిబింబాలు మనవి_అంతంలేని అనుబంధానికి సాక్ష్యంగా...!!
11. వాస్తవాల ఉరుములు_భవిష్యత్తును భయపెడుతూ...!!
12. మనసుకే అన్ని కష్టాలు_పాపమేమి చేసిందో...!!
13. అక్షరాలన్నీ ఎనలేని సంపదే_దొంగిలించే వీలు లేకుండా...!!
14. దుఃఖపు దారిని మళ్ళిస్తున్నా_సంతోషాలను చేరువ చేయాలని...!!
15. విశేషాలతో నిండుతున్నాయి_జ్ఞాపకాల గదులన్నీ...!!
16. నిరీక్షణకు స్ధానమే లేదు_మనసంతా నువ్వయ్యాక..!!
17. చైతన్యానికి చేరువౌతున్నా_మరణంతో నిత్యం రణం చేస్తూ...!!
18. గెలుపు అనివార్యం కావాలి_మానవత్వాన్ని స్వాగతించడానికి...!!
19. శోకానికి తెలుసు_శ్లోకంలో పోగొట్టుకున్నది దొరుకుతుందని...!!
20. మనసు గేయం వింటున్నా_ అలంకృతమైన మౌనంలో...!!