3, అక్టోబర్ 2017, మంగళవారం

ఆడపిల్లనమ్మా...!!

సృష్టికి మూలమైనా
అమ్మ కొంగు చాటు ఆడపిల్లనే
నాన్నకు యువరాణినే
అన్నదమ్ములకు తోబుట్టువునే
ఆత్మీయతానుబంధాలకు చిరునామానే
మమతానురారాలకు నెలవుని
ఆదిపత్యపు అహంకారానికి అడ్డుగోడగా
ప్రపంచ పురోగమనానికి గీటురాయిగా
అన్నింటా నేనంటూ
అన్నీ తానైన ముగ్ద మనోజ్ఞి
మన ఇంటి మారాణి
ప్రగతి పూబోణి
ఈ పుత్తడిబొమ్మ...!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

..గౌతమి చెప్పారు...

ప్రగతి పూబోణి

అజ్ఞాత చెప్పారు...

అన్నింటిలో తగుదునమ్మా అంటూ దూరి లేడీస్ మగాళ్ల బతుకులు పచ్చడి చేస్తున్నారు

Zilebi చెప్పారు...

పూబోణి! ప్రగతి కి పడతి !
రాబోయే కాలము మన రాజ్ఞులదే న
మ్మా బారంబాటుగనౌ !
కాబో లందుకని, యన్ని కర్మలు మనవే !

జిలేబి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner