3, అక్టోబర్ 2017, మంగళవారం
జీవన 'మంజూ'ష (4)...!!
బంధం అనేది అవసరానికి అనేక రకాలుగా రూపాంతరం
చెందుతోంది ఈ కలియుగంలో. మన జీవితంలోని అన్ని అనుబంధాలు అవసరార్ధ బంధాలుగా
మిగిలిపోతున్నాయి. ఆడ మగ స్నేహానికి నానార్ధాలు చెప్పడంలో ఇప్పటి ప్రచార
మాధ్యమాలు కానీ, సోషల్ నెట్ వర్క్స్ కానీ ముందుంటున్నాయి. మన ప్రవర్తనే
ఇందుకు మూల కారణంగా చెప్పవచ్చు. సమాజం అంటే మనమే. మరి సమాజంలో మార్పు
కోరుకోవడమంటే మనలో మార్పుని ఒప్పుకోవడం. ఎక్కడ చూసినా విపరీతార్ధాల వింత
పోకడలు, కుటుంబ అనుబంధాలు కకావికలమై పోతున్న ఈ కాలంలో మన అన్న అనుబంధాన్ని
నిలబెట్టుకోవడం అనేది కత్తి మీద సాము లాంటిదే. ఏ చిన్న లోపాన్ని సహించని
సహజీవనాలు మనం అరువు తెచ్చుకోవడమెందుకు, మనకు అక్కరకు రాని బంధాలు ఛిద్రమై
పోతున్నాయని బాధ పడటమెందుకు. అమ్మానాన్న, అక్కాచెల్లి, అన్నాతమ్ముడు,
ప్రేయసీప్రియులు, పిల్లలు, స్నేహాలు ఇలా మానవ సమాజంలో మనకంటూ మిగిలిన ఈ
బంధాలను కూడా అక్రమ బంధాలుగా మార్చేస్తున్న నేటి సమాజంలోని కొందరు
ప్రముఖులు కావచ్చు, ఊరు పేరు లేని అనామకులు కావచ్చు ఎదుటివారి అవసరాన్ని,
అమాయకత్వాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని పబ్బం గడుపుకుంటూ పైకి మాత్రం
అతి మంచివాళ్ళుగా నటిస్తూ నాలుగు రోజులకో కొత్త బంధానికై వెంపర్లాడుతుంటే,
వీరిని ఏ నిర్భయ చట్టం మాత్రం ఏం చేస్తుంది. అసహాయతను అవకాశంగా మార్చుకునే ఈ
నికృష్ట జాతిని సమాజం వెలివేసి రోజు ఎప్పుడు వస్తుందో...!!
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి