1. వయసుడిగినా అందమే_ఆత్మీయత నిండిన జీవితాల్లో...!!
2. ధనాత్మకమైనాయి_అరువు తెచ్చుకున్న అనుబంధాలు..!!
3. హర్షపు చిరుజల్లులే అన్నీ_నీ స్నేహంలో సేదదీరాక...!!
4. అపాత్రదానపు ప్రేమలు_అందుకోలేవు ఆత్మీయతాస్తాన్ని...!!
5. అమ్మదనం అలానే ఉంది_అనాధలకు ఆలంబనౌతూ...!!
6. లెక్కకు తేలని శేషమే_ప్రేమ రాహిత్యంలో మునిగి...!!
7. రాహిత్యాన్నీ పెంచుతుంది_అందీ అందని ప్రేమ..!!
8. అక్షరం అక్కునజేర్చుకుంది_అమ్మలా ఆసరానందిస్తూ...!!
9. పరిచయం పాతదే_సరి కొత్త పరిమళాన్ని వెంట తెస్తూ...!!
10. వలపెంత పంచాలో_బంధం బలపడటానికి....!!
11. అనుభూతుల అశ్వాలే అన్నీ_అక్షరాల రథాన్ని అధిరోహిస్తూ...!!
12. మనో గవాక్షం తెరచుకుంది_నీ వలపు అలికిడికి....!!
13. మది తలుపులు తెరిచే ఉన్నాయి_నీ తలపు రాక కోసం...!!
14. గమ్యం పరిచితమే_ఆటుపోట్ల రుచి చూసాక...!!
15. అక్షరాల అలికిడిలో జీవిస్తున్నా_వాస్తవాలను విశదీకరిస్తూ....!!
16. సాక్ష్యాలన్నీ సజీవాలే_అక్షర లక్షలకు ప్రణమిల్లుతూ....!!
17. శృంఖలాలకు ఆటవిడుపే_అక్షర యుద్ధంలో గెలిచిన భావాలతో.... !!
18. ఇలా వెళిపోయింది కాలం_నీ తలపులను తోడ్కొని..!!
19. జరిగిపోయిన కాలంలో_జ్ఞాపకాల జలతార్లు...!!
20. కనువిందు చేసిన స్వప్నాలెన్నో_
వాస్తవానికి ఊతమిస్తూ...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి