1. గడవనీయడం లేదు కాలం_నీతో లేని క్షణాలను స్వీకరించలేక....!!
2. మనసు తడి మాయమౌతోంది_అక్షరమై కాగితాన్నలరిస్తూ...!!
3. తీరలేదనే తలపుల్లో తచ్చాడుతోంది_గతజన్మ బుుణానుబంధంగా....!!
4. ఆరాధన అక్షరాల్లో ఉండిపోయింది_ఈ యత్నమంతా నీ మనసుకు తెలియాలనే...!!
5. అక్షరార్చన అందంగా ఇమిడింది_నీ ఊసులు చేరినందుకనుకుంటా...!!
6. భావాలు త్వరపడుతున్నాయి_కవన నివేదనలో చరితార్థమవ్వాలని...!!
7. చూసి చూడనట్టుంటే ఎలా_పదబంధాల వెంట పయనించాలి మరి..!!
8. అక్షరాలు కనుకే ఆ బంధం_ఎదలో పదిలమైపోవాలన్నంత ఆరాటంతో...!!
9. అక్కున చేర్చుకుంది అక్షరమే_గాయాలకు ఆత్మీయలేపనమై...!!
10. అక్కర మక్కువైంది_అక్షరం భావంతో జత కట్టినప్పుడు....!!
11. నా ఓటమిని ఆస్వాదిస్తున్నా_నీ గెలుపు నేనై...!!
12. కన్నీరొలికిందని తెలిసింది_కలను వదలి వాస్తవానికి వచ్చాక....!!
13. కాలాన్ని ఏమార్చడం సాధ్యమా_మనసైన మౌనపు ముచ్చట్లెలా ఉన్నా...!!
14. మతమెా సదాచారం_మతోన్మాదుల చేతుల్లో కార్చిచ్చులా మారిపోతూ...!!
15. వేస్తున్నవన్నీ అద్దె వేషాలే_అక్షరభావాలనడ్డం వేసుకుని...!!
16. నిలిచిపోవాలనుంది_నిష్క్రమణమెరుగని నిత్య నూతన జ్ఞాపకంగా...!!
17. ఎడబాటు మనుష్యుల మధ్యనే_ఎడదనెరిగిన అక్షరాలకు కాదు...!!
18. మనసుకలవాటే_మెాసపోతున్నా బంధాన్ని బాధ్యతగా అనుకోవడం...!!
19. భారంగా మారింది మది_అమ్మను అవహేళన చేసిన అహాన్ని చూసి..!!
20. వెన్నుపోటే వారి నైజం_అది తెలిసిన క్షణాలు భారమే మరి...!!
21. కాకరకాయ మేలే చేస్తుంది_మనం కీడు చేయాలనుకున్నా...!!
22. గాయమైన ప్రతిసారి గేయమైపోతున్నా_మనసు కొలను ఖాళీ చేయాలనుకుంటూ...!!
23. బంధపు విలువ తెలియని మూర్ఖత్వమది_కీడు చేయాలన్న ప్రయత్నంలో....!!
24. వెనుకకెలా మరలను_కన్నీటి కథలు లేని జీవితమదని తెలిసాక...!!
25. ఆత్మీయ వరుసలతో ఆడుకుంటున్నారు_ అమ్మను అక్కను అంగడి బొమ్మను చేస్తూ...!!
26. విషం చిమ్మడం జాతి లక్షణం_పాలు పోయడం మన నైజమైనప్పుడు...!!
27. కలలూ కలత పడుతున్నాయి_ఏ జ్ఞాపకం ఎదను తడిమిందో..!!
28. ఆదరింపు ఆదమరిచింది_కలత ఎదను కలవరపెడుతుంటే...!!
29. తిరుగుబాటు జీవితమైంది_సవాళ్ళను స్వాగతిస్తూ...!!
30. కలానికి ఓదార్పయ్యింది కాగితం_భారాన్ని తాను స్వీకరిస్తూ...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి