1. కలంలో ఒదిగిన సిరా_కాలపు క్షణాలను ఒద్దికగా లిఖిస్తూ....!!
2. చెదరని గురుతులవి_వదలక వెంబడిస్తూ...!!
3. సరాగమూ విరాగమే_మనసాక్షరాలకు మనసెరుక కానప్పుడు...!!
4. గత'మది' ఘనమైనదే_జ్ఞాపకాల మంజూషమై...!!
5. కుంచెడు నవ్వులొలికాయిగా_పుంజీడు పలుకులకు...!!
6. మనసు విదిల్చిన సిరాచుక్కలు_సాంగత్యానికి నోచుకోని శిథిలాక్షరాలేమెా....!!
7. ఆకాశమంత ఆదరణ అమ్మది_కన్నీటి కడలిని తనలో దాచుకున్నా...!!
8. దైన్యానికి ధైర్యమద్దింది_మది గాయాలకు రాగాలు నేర్పి...!!
9. క్షణమైనా ఆగలేదు_కాలానికెంత అసహనమెా...!!
10. కొలమానమక్కర్లేని మనసులవి_స్వచ్ఛతకు మారుపేరుగా...!!
11. చందమామ కథలకు నోచని బాల్యమిది_అమ్మ లాలిపాటలకు దూరమై...!!
12. మన్నన మప్పిదమే ఎప్పుడూ_వేదికనెక్కిన వేర్పాటువాదులకన్నా...!!
13. లయ తప్పని నాదమది_యుద్ధభేరైనా అస్త్ర విన్యాసమైనా...!!
14. మనసెప్పుడూ మౌన సంద్రమే_భావాక్షరాలను వెదజల్లుతూ...!!
15. మన ఆలోచనల రంగే అది_అవలీలగా ఎదుటివారికద్దేస్తూ...!!
16. మరణమెరుగనిది అక్షరమే_భావాలతో నిత్యం రణం చేస్తున్నా...!!
17. ఆకాశమే హద్దు అక్షరానికి_భావసంద్రాన్ని సముదాయించడంలో..!!
18. దూరమన్న ఊహే లేదు_మనసుల మధ్యన అంతరాల్లేనప్పుడు...!!
19. వెలుగు విసిరేసింది_చీకటి చేతికంటనీయవద్దంటూ...!!
20. తగవులాడే సమయమెక్కడది_తలపుల్లో తలమునకలౌతుంటేనూ...!!
21. తలపుల వడపోతలే అన్నీ_జ్ఞాపకాల వెదుకులాటల్లో...!!
22. ఏకాంతమే వారధి_మన జ్ఞాపకాల ఖజానాకి....!!
23. అనునయాలను అందుకుంటున్నా_ఆత్మీయత నిండిన నీ పలుకుల్లో...!!
24. ఆటుపోట్లు అలవాటే కడలికి_అలుపెరగక అన్నింటిని అక్కున చేర్చుకుంటూ...!!
25. ఆత్మీయంగా హత్తుకుంటే చాలదూ_విషాదాన్ని వెలి వేయడానికి....!!
26. మది మనసు పడుతుంటుందప్పుడప్పుడు_ఆనంద విషాదాలపై...!!
27. కాలమెప్పుడూ దయగలదే_దూరాలను జ్ఞాపకాల్లో దగ్గర చేస్తూ...!!
28. మనసుకూ తెలిసిపోయింది_నా మౌనం నీతోనే మాట్లాడుతుందని..!!
29. ఎద ఎదకో సొద_మనుషులతో రాజీ పడలేక...!!
30. రంగుల లోకం చూపిన అందాల రాక్షసి_కలత నిదురలోని కల...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి