1. మనసు తడి నే తీసుకున్నా_మౌనం నీకొద్దంటూ...!!
2. అప్పటి పరిచయ క్షణాలే_ఇప్పటికీ అదే పరిమళ భావాలతో...!!
3. మనసు మనసుకో ముచ్చట_మురిపెంగా మురిసిపోవాలని...!!
4. మౌనానికీ ఎరుకయ్యింది_నీ మాటల మాయలో నే పడిపోయానని..!!
5. ఏమెరుగని అమాయకత్వమది_చవితి చంద్రుని చూసిన నీలాపనిందలతో..!!
6. మనసాక్షరాలంతే మరి_భావాలనలా బంధించేస్తూ.....!!
7. మనసుకు ఊరటనందివ్వడమే_అక్షరంతో నెయ్యమంటే...!!
8. అలవాటే అది అక్షరాలకు_జత చేరుతున్న భావాలను ముచ్చటగా చూపడం...!!
9. అక్షరాలకూ అలవాటే_మనసుని తమలో చూపడం...!!
10. అక్షరాలతో జత కట్టానందుకే_భారాన్నంతా భావాల్లో వొంపేద్దామని...!!
11. అధిగమించాలి అడ్డంకులను_భావాక్షర బంధాలను బలోపేతం చేయడానికి...!!
12. పదాలన్నీ దాసోహమంటున్నాయి_గుండెల్లో దాగిన నీ ప్రేమ తెలిసిందనుకుంటా...!!
13. తొలగించావుగా విముఖతను_నీ ప్రేమతో మనసు అందాన్ని అలంకరిస్తూ...!!
14. మౌనం మనసు విప్పింది_ఆరాధనకు పరమార్థాన్ని వివరిస్తూ...!!
15. కంటి కొలను నిండింది_మనసు భారాన్ని తాను స్వీకరిస్తూ...!!
16. వెక్కిరింతలకు వెరవకూడదు_కలతల గాయాన్ని గెలవనీయక...!!
17. గాయానికి ఓటమి రుచి చూపాలి_కలతల కల్లోలానికి ఆనకట్ట వేస్తూ...!!
18. మౌనాకికెరుకే మరి_మది గాయాలకు లేపనమేమిటో...!!
19. అనునయాల ఊరడింపులే అన్నీ_మది గాయాల కలవరింపులకు...!!
20. చెంతనే చేరింది చెలిమి_కన్నీటి కడలికి తావీయకంటూ...!!
21. చేయూతనివ్వడానికే చెంత చేరింది_నెచ్చెలి మనసు నొచ్చకుండా...!!
22. మౌనం అనివార్యం_శూన్యమదిని నిలువరించడానికి...!!
23. తపస్సు మౌనానిదే_నీ మాటలను మనసులో ధ్యానిస్తూ...!!
24. ప్రతి రేయి ఊసులాడుతుంది_నీ జ్ఞాపకాల గురుతులతో...!!
25. మౌనాల అల్లరే అనుక్షణం_వేకువపొద్దును స్వాగతిస్తూ..!!
26. రాతిరి నవ్వులే అవి_వేకువపొద్దు వెలుగురవ్వలుగా...!!
27. మౌన తమస్సది_నీ స్మరణే ప్రాణనాదమై...!!
28. మౌనాక్షరాలు రాశులుగా పేరుకున్నాయి_చెల్లింపులు సరిపోలేదనుకుంటా....!!
29. అక్షరసంచారమే జీవితం_మనసును సముదాయించడానికి...!!
30. ఆవాహన చేసుకుంటున్నాయలా_మదిని అక్షరాల్లోనికి....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి