11, జులై 2019, గురువారం

ఏక్ తారలు...!!

1.  ఉదయపు అంతరంగమే_రాతిరి కలల్లో నిక్షిప్తమౌతూ...!!

2.   భావాలకు దృడత్వమెక్కువే_వేదనలకు చరమగీతాలు పలకడానికి...!!

3.   మనుష్యులకే రాహిత్యమనుకున్నా_రాతలక్కూడా అని తెలియకముందు..!!

4.   భాషతో పనిలేదు_శోకాన్ని శ్లోకంగా మలిచిన పుణ్యభూమిలో..!!

5.   నిజాయితి నెమ్మదిగానే ఉంటుంది_అబద్ధానికి గొంతెక్కువైనా...!!

6.   భాష్యమై మిగిలిపోతున్నా_అక్షరాల ఆంతర్యాన్నందిస్తూ..!!

7.   తీసుకోవడానికేముంది కొత్తగా_స్వప్నమై చేరువగా నువ్వుంటే..!!

8.   కొలిమి కాలుతూనే ఉంది_సమ్మెట దెబ్బలతో వంకర్లు సరి చేయడానికి...!!

9.   అనునయించేది ఆ అక్షరాలే_మనసుల మాలిన్యాలను కడిగేస్తూ...!!

10.    క్షణాలకెంత స్వార్థమెా_చిటికెలో తనను మాయం చేస్తూ...!!

11.  అపహాస్యపు బతుకులే అవి_అక్షరం విలువెరగక..!!

12.   ఎద ఏకాంతమంతే_జ్ఞాపకాలతో గలాటాలాడేస్తూ...!!

13.   పుట్టుకను మరిచిన జాతది_అమ్మకు ఆలికి తేడా తెలియక..!!

14.   అన్ని ప్రేమలు అంతే_బంధాన్నో బాధ్యతనో గుర్తుచేస్తూ...!!

15.   శరాలు సంధింపబడ్డాయి_ముసుగులు తొలగడమే తరువాయి...!!

16.   అల్లుకున్న ప్రేమలెప్పుడూ ఇంతే_విడదీయరాని పెంకిఘటాలైపోతూ..!!

17.    ఏమరుపాటది మనసుకు_రెప్పల తడి తనదని తెలియక..!!

18.   పరిమళం స్వభావమే అంత_భావాలకు అణుగుణంగా ఒదిగిపోతూ..!!

19.   మందహాసం మాయమవదు_ముగింపు తెలిసినా..!!

20.   అలసటెరుగనివే ఆ అక్షరాలు_నిరంతరం జీవనాదమాలపిస్తూ..!!

21.  తడబాటే అడుగులది_ఏడడుగులదే తీరమెానని..!!

22.   అవకాశం తీసుకుందో అధికారం_వక్రీకర వశీకరణ విద్యను చూపెడుతూ...!!

23.   మమకారమూ ఓ మాయే_నటించే మనుషుల చేతిలోని అక్షరాలకు..!!

24.   మాయక(త)త్వం మనసుదే_అక్షరాన్ని అనుకూలంగా మార్చేసుకుంటూ...!!

25.   భావాలకు అధిక్షేపణలెక్కువే_అక్షరాలకు ఆధిపత్యపు లక్షణాలు లేకున్నా..
!!

26.   మౌనంలోనే మిగులుతుంది మనసు_పరిచయమెా పలకురాయిగా మారినప్పుడు..!!

27.  కొన్ని మనసులు ఇంతే
వ్యధలకు చిరునామాగా వేసారిపోతూ...!!

28.   కాటు వేసే కాలసర్పాలెన్నో_ముఖపుస్తక ఆత్మీయతల మాటున...!!

29.   మౌనానిదెప్పుడూ అగ్రస్థానమే_మనసులని చదివేయడంలో...!!

30.   మౌనానిదో మహోన్నత స్థానం_ఓరిమిలో ధరిత్రిని తలపిస్తూ...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner