1. సహనానికీ ఓ హద్దుంటుంది_మౌనమే మరణశాసనమౌతూ..!!
2. దాచుకున్న జ్ఞాపకాలివి_కాలాన్ని క్షణాల్లో వెనుకకు మరలిస్తూ...!!
3. సహనాన్ని పరీక్షిస్తోంది_కాట్లకుక్కల కుటిలతత్వం బయటబడుతూ...!!
4. చెలిమి మనసు మహా దొడ్డది_పరిచయాలు ఎన్ని గుణపాఠాలు నేర్పినా...!!
5. పరిభ్రమణం నిరంతరాయమే ఎప్పుడూ_భ్రమలన్నింటా అలవాటైపోయి...!!
6. విలక్షణమైనదే విన్యాసం_మనసాక్షరాలకు ఆకతాయితనమెక్కువైనా...!!
7. పదాలకు ఉరవడి ఎక్కువే_కాలంతో పోటిగా...!!
8. మన అనుబంధం అపురూపం_గుప్పెడు గుండెలో పదిలమై..!!
9. తరుగు లెక్కలేయలేదు_తరగని అనుబంధం మనదని తెలిసి...!!
10. ఎన్నదగిన బంధమే ఇది_అక్షరాల అనుభూతులతో ముడిబడి...!!
11. భారాన్ని మెాయడమలవాటేగా భావాలకు_మనసుకు ఊరటనందిస్తూ...!!
12. ఎన్నదగిన బంధమే మనది_అక్షరాల సాక్షిగా కలిసిన నెయ్యమై...!!
13. అనుబంధాల సందడులే అన్నీ_నీ చెలిమి చేరికతో...!!
14. తెలివైన వారి లక్షణం_అపహాస్యాన్ని అభినందనగా మార్చుకోవడమే...!!
15. అలకలన్నీ అక్షరాల్లో కనిపిస్తాయి_అలిగిన ప్రతిసారి...!!
16. అక్షరాల ఊసులతో ఊరడిస్తున్నా_గాయపడిన నేస్తాన్ని..!!
17. వెంటబడుతున్నాయి భావాలు_అక్షరాల్లో ఒద్దికగా ఒదిగిపోతామంటూ..!!
18. బంధించనలవి కానిదే ఈ బంధం_సొగసులీనే అక్షరాలకు దాసోహమవుతూ..!!
19. మనసు తెలిసిన చెలి'మది_మార్మికత గుట్టు విప్పుతూ..!!
20. రాయలేని అక్షరమైంది
రాతి మనసును చూపలేని ఉలి తానై మిగిలి...!!
21. మనసు రాల్చిన మౌన వేదన_శిథిలాలలోనూ సజీవమే..!!
22. చరిత్రే చరితార్థం_అక్షరాంగనలద్దిన పద చాతుర్యానికి..!!
23. శిలకు చలనం వస్తుంది_మనసాక్షరాలు మౌనాన్ని వీడితే...!!
24. మనసు మాటను రాద్దామనుకున్నా_కవనమై కాంతులీనుతోంది...!!
25. నమ్మకమదే_మనసాక్షరాలు కఠిన పాషాణాన్నైనా చలింపజేస్తాయని...!!
26. భావాలెప్పుడూ అంతే_అలవికాని మాధుర్యాన్ని అక్షరాలకందించేస్తూ...!!
27. మౌనమెప్పడూ ఇంతే_మాటలకడ్డం పడిపోతూ...!!
28. మమతెప్పుడూ ఇంతే_మనసునొదిలి పోలేనంటూ...!!
29. బంధాలెప్పుడూ ఇంతే_బాధ్యతల నడుమ బంధీలౌతూ..!!
30. ప్రణయమంటే ఇదేనేమెా_గతజన్మ బంధాన్ని జ్ఞాపకం చేస్తూ..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి