18, జులై 2019, గురువారం

వెదుకులాట..!!

చేజారిన క్షణాలను
అక్షరాల్లో వెదుకుతున్నా

మాసిపోయిన జ్ఞాపకాలను
పదిలపర్చుకోవాలని చూస్తున్నా

రాలిపడిన కన్నీళ్ళను
గుప్పెట్లో దాయాలనుకుంటున్నా

కలత చెందిన కలలను
కలవర పడవద్దంటున్నా

గాయపడ్డ గుండెను
గతాన్ని మరవద్దంటున్నా

మౌనమైన మనసును
మాయమై పొమ్మంటున్నా

రెప్పలిప్పని కనులను
రేయి చాటునే దాగిపొమ్మంటున్నా

పలుకరించే భావాలను
పదవిన్యాసం చేయమంటున్నా

వేధించే వెతలను
వారించే జీవనచిత్రమిదేనంటున్నా...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner