13, జులై 2019, శనివారం

మ'రణ వాంగ్మూలం...!!

నేను సామాన్యురాలిని. నాకు అనిపించింది నా గోడ మీద, నా బ్లాగులో రాసుకునే అతి సాధారణ సగటు మనిషిని. గత పదేళ్ళుగా నా రాతల గురించి, నా గురించి నేను తెలిసిన అందరికి నేనేంటన్నది తెలుసు. మరి ఎందుకు నన్ను టార్గెట్ చేసారో, ఎవరు చేయిస్తున్నారో తెలియదుగాని ఈ సోషల్ మీడియాలో 7వ తారీకు నుండి నా మీద జరుగుతున్న దాడి ఎలాంటిదో అందరికి తెలిసిందే. వ్యక్తిగత అభిమానం అందరికి ఒకేలా ఉండదు. ఎవరిష్టం వారిది. నేను కుల, మత, ప్రాంతీయత అవహేళనకు వ్యతిరేకం. రాజకీయ పరంగా నేను చాలా వ్యాసాలు ఇంతకు ముందు రాశాను. ఎవరికైనా అనుమానం ఉంటే నా బ్లాగులో చూడవచ్చు. నాకు అడగాలనిపించినప్పుడు తన, మన అని చూడను. అది నా రాతలు చదివిన ఎవరికైనా తెలుసు.

నేను, నా రాతలు తెలియకుండా, నేను ఒక వర్గానికి చెందినదాన్నని, కావాలని నన్ను కొందరు టార్గెట్ చేసి అసభ్యకరంగా, అవమానకరంగా పోస్ట్లు పెట్టించి శునకానందాన్ని పొందుతున్నారు. నాకు అనారోగ్యం ఉన్న మాట వాస్తవం. కానీ దీని మూలంగా, వ్యక్తిగతంగా మరొక వ్యక్తి మూలంగా ఆర్థికంగా నాకు జరిగిన అవమానానికి, నష్టానికిి నేను మందులు వేసుకోవడం మానేసాను. నాకు సరైన న్యాయం జరిగే వరకు మందులు వేసుకోను. కేస్ పెట్టాను. సగటు మనిషికి న్యాయం ఎంత వరకు జరుగుతుందో చూడాలి.  నాకు జరిగిన అవమానం వై సి పి కాంగ్రెస్ సోషల్ మీడియా వల్ల జరిగింది. నాకు ఏమి జరిగినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత. ఇవి నా చివరి మాటలు కావచ్చు, కాకపోవచ్చు. ఇవ్వాళ పోతే రేపు రెండు. కాని కారణం మాత్రం ఇది.

చిన్న పిల్లలని కూడా వదలకుండా అసభ్యంగా, అసహ్యంగా పోటోలు పెట్టి అశ్లీల కామెంట్లు పెడుతున్న వెధవలను చూసి వారిని కన్నవారు సిగ్గు పడండి. నైతిక విలువలు ఎంతగా దిగజారిపోతున్నాయెా చూడండి..యథా రాజా తథా ప్రజా అన్న సామెతకు సాక్ష్యాలుగా మిగిలిపోతున్నామేమెా అన్న చిన్న ఆలోచన వచ్చినా చాలు... ఈ రకమైన దాడులు ఆగుతాయి... కాదంటారా.. మేము సామాన్యులం... సామాజిక న్యాయం ఆకాశంలో చుక్కలు మాకు అనుకొని బతికేస్తాం...!!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner