16, జులై 2019, మంగళవారం

అంతిమం...!!

శకలాలన్నీ శరాలుగా మారి
శాపాలై చుట్టేస్తూ
అస్పష్ట విజయంలో
మిగిలిన ఉన్మాదపు
అవశేషాల ఆనవాళ్ళకై
రణభూమిలో రాబందులను
పారద్రోలుతూ వెదుకులాటను
నిర్విరామంగా కొనసాగిస్తూ పోతుంటే
స్మశాన నిశ్శబ్దం చుట్టేసి
వేదనల్లో వైరాగ్యమలుముకుని
అబద్ధానికి కావలి కాస్తున్న
అధికారపు అంధకారానికి
నిజాయితీ నిప్పురవ్వలు
రగిలించిన చితిలో
ఏ హడావిడి లేని
సత్యం నిర్భయంగా నిలిచింది...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner