8, ఫిబ్రవరి 2020, శనివారం

వివాదాస్పదమౌతున్న నేటి సినిమా పాటలు..!!

ఈ నెల నవ మల్లెతీగలో నా వ్యాసాన్ని ప్రచురించిన మల్లెతీగ సంపాదకులకు నా మనఃపూర్వక ధన్యవాదాలు..

వివాదాస్పదమౌతున్న నేటి సినిమా పాటలు..!! 

తెలుగు సినీ వినీలాకాశంలో పాత కొత్త పాటల్లో కొన్ని ఆణిముత్యాలైతే మరికొన్ని కర్ణకఠోరమైనవి. సాంఘికమైనా పౌరాణికమైనా పాత తరం పాటల్లో చిత్రానికి తగ్గట్టుగా సన్నివేశానికి అనుకూలంగా అర్ధవంతమైన పాటలు చక్కని సంగీతంతో జత పది ఉండేవి. ఇప్పటికి ఆ పాత మధురాలు మనలను వీడిపోలేదంటే  అప్పటి పాటల్లో సంగీతం కానీ, సాహిత్యం కానీ మనసులకు దగ్గరగా ఉండేది. ఇప్పటి పాటల్లో ఎక్కువగా సంగీతమే సాహిత్యాన్ని వినబడనీయకుండా చేస్తోంది. 
            అప్పటి పాటల్లో ఏ సినిమా తీసుకున్నా..  ఓ పాతాళభైరవి, మాయాబజార్, జగదేక వీరుని కథ వంటి పౌరాణిక చిత్రాలు, డాక్టర్ చక్రవర్తి, కులగోత్రాలు, గుండమ్మ కథ వంటి సాంఘీక చిత్రాలోని పాటలు సంగీతం కానివ్వండి ఇప్పటికి అజరామరమే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.  కారణం కథ, కథనం, సన్నివేశాలకు తగ్గట్టుగా పాటల్లో సాహిత్యం కానీ సంగీతం కానీ ఉండేది. 
             ఇక మధ్య తరంలో వచ్చిన సినిమా పాటల్లో రాను రాను కాస్త సంగీతం పాలు ఎక్కువగా ఉండటం మొదలైంది. అల్లూరి సీతారామరాజు, భక్త కన్నప్ప, సిరివెన్నెల, నిరీక్షణ, దేవాలయం వంటి ఎన్నో సినిమాల్లో అర్ధవంతమైన సంగీత సాహిత్యాలతో కూడిన పాటలు మనకు వినసొంపుగా ఉండేవి. కొన్న్ని సంగీత ప్రధానమైన సినిమాలు, శంకరాభరణం, సప్త పది, సాగర సంగమం, స్వాతిముత్యం లాంటి సినిమా పాటలు పాటల ప్రియులకు చక్కని సంగీతంతో పాటు మంచి సాహిత్యంతో కూడిన పాటలను అందించాయి.
           ఇప్పుడు చాలా వరకు పాటలు అర్ధమే కాకుండా టెక్నలాజి అందుబాటులోకి వచ్చి బీట్స్ వినిపించడమే తప్ప పాటలోని సాహిత్యం కనుమరుగై పోతోంది. చాలా పాటలు వివాదాస్పదమౌతున్నాయి. తెలుగు పాటల సాహిత్యంలో ఒకరిని కించపరిచే సంస్కారం ఎక్కువైపోతోంది. సినిమాకు పాటలు రాయించుకునే దర్శకులదా, అసభ్యకరమైన పదాలతో రాసే పాటల రచయితలదా, అర్ధంలేని సంగీత వాయిద్యాలతో ఊదరగొట్టే సంగీత దర్శకులదా లేక ఇలాంటి సంస్కృతికి తెర తీసి ఆదరిస్తున్న ప్రేక్షకులదా... తప్పు ఎవరిది..?


9 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

నీహారిక చెప్పారు...

వివాదాస్పద పాటల ప్రసక్తి లేకుండా వ్రాసిన వ్యాసాన్ని ప్రచురించి తన సత్తా నిరూపించుకుంది మల్లెతీగ.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
చెప్పాలంటే...... చెప్పారు...

అందరికి తెలిసినవే కదండి... ఆ పాటలు.. థాంక్యూ

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

“నవ మల్లెతీగ” అనేది ఒక వెబ్ పత్రికాండీ? లింక్ ఇవ్వగలరా ప్లీజ్?

చెప్పాలంటే...... చెప్పారు...

కాదండి ...మాస పత్రిక..

చెప్పాలంటే...... చెప్పారు...

మీ ఈ మెయిల్ ఐడి ఇవ్వండి... పిడిఎఫ్ పంపిస్తాను

నీహారిక చెప్పారు...

వివాదాస్పదమైన పాటలు అంటే తెలియాలి కదా ?

పాతరోజుల్లో "మసక మసక చీకటిలో" పాట వివాదాస్పదమే కానీ ప్రజలు ఆదరించారు. ప్రజలు ఆదరించారు అంటే ఏ వెధవ(పాట)నయినా గౌరవించాల్సిందే !

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...

థాంక్సండీ. నా మెయిల్-ఐడి narasimharao.vinnakota@gmail.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner