5, మార్చి 2020, గురువారం

జీవన 'మంజూ'ష (మార్చి )

నేస్తం, 
       అంతర్జాలం విరివిగా అందుబాటులోనికి వచ్చిన తరువాత నేరాల, ఘోరాల సంఖ్య ఎక్కువైనదన్నది అందరం ఒప్పుకుని తీరవలిసిన వాస్తవం. నేరాలు అనాది నుండి జరుగుతూనే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు వెంటనే తెలిసిపోతున్నాయి ఈ సామాజిక మాధ్యమాల పుణ్యమా అని. 
     ఆధునికంగా ఎంతో పురోగతిని సాధించిన మనం ఈ నేరాలను అరికట్టడంలో విఫలమవడానికి కారాణాలనేకం. ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తోంది. మన రాజ్యాంగ పరిధులను బట్టి " వందమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్న " సదుద్దేశ్యం. దీనిని ఆసరాగా చేసుకుని దోషులు శిక్షల నుండి తప్పించుకోవడానికి సవాలక్ష మార్గాలను చూసుకుంటున్నారు. అధికారాన్ని, ధనాన్ని విరివిగా ఉపయెాగిస్తూ తమ నేరాలను బుుజువు కాకుండా నిర్దోషులుగా బయట పడుతున్నారు. లేదా అమాయకులకు శిక్షలు వేయిస్తున్నారు. నేరం చేసిందొకరయితే, శిక్ష మరొకరికన్న మాట. ఇది మన నేటి వ్యవస్థ తీరుతెన్నులు. 
         ఇక మీడియా విషయానికి వస్తే జరిగిన నేరాలు వేలల్లో ఉంటే వీరు పదే పదే చూపించే క్లిపింగ్స్  ఒకటో, రెండో సంఘటనలకు సంబంధించినవి మాత్రమే. మరి కొన్ని ఛానల్స్ అయితే మరికాస్త ముందుకు వెళ్ళి జరిగిన సంఘటనను చిన్న చిన్న నటీనటులతో చిత్రీకరిస్తూ, ఆ నేరం ఇలా జరిగుండవచ్చు, అలా జరిగుండవచ్చంటూ సినిమాలు, సినిమాలుగా మనకు చూపించడం వలన వాళ్ళ ఛానల్ రేటింగ్స్ పెంచుకోవడానికే ప్రయత్నిస్తున్నారు కాని ఆ నేరాలు తగ్గించడానికి ఏమాత్రం తమ వంతు ప్రయత్నాలు చేయడం లేదు.
    మన రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎవరి కోసం ఉన్నాయెా తెలియని అయెామయం నేడు ప్రతి ఒక్కరిలో ఉంది. సి సి కెమేరాల ఏర్పాటు, రాత్రుళ్ళు పహరా పోలీసులు ఇలా ఎందరో పాపం మన కోసం కష్టపడుతూ.. నిర్విరామంగా నేరాలు జరగకుండా ఉండటానికి చర్యలని నాయకులు, అధికారులు ఉపన్యాసాలు వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క సంఘటనలోనయినా పోలీసులు కాని, వారు ఏర్పాటు చేసిన వివిధ రక్షణ చర్యలు కాని నేరాలు, ఘోరాలు జరగకుండా నిరోధించగలిగాయా? సి సి కెమేరాలు కర్మచాలక పని చేసినా నేరం ఎలా జరిగిందో అన్న విషయానికి సాక్ష్యంగా మాత్రమే పనికి వస్తోంది, అదీ సదరు పోలీసులు ఏ ఎడిటింగ్ చేయకుండా ఉంటే. ఇక మన పోలీసులు నేరం జరిగాక ఆర్చుకుని, తీర్చుకుని తీరికగా వస్తారు. లేదంటే సదరు బాధితులు వెళ్ళి కంప్లయింట్ ఇవ్వబోతే యక్ష ప్రశ్నలతో వారిని వేధించి, బతికుండగానే చంపేస్తూ, చివరాఖరికి ఈ సంఘటన జరిగిన ప్రదేశం మా పరిధిలోనికి రాదని చావు కబురు చల్లగా చెప్తారు. జీరో ఎఫ్ ఐ ఆర్ ఉందని ఎవరికీ తెలియదన్న ధీమాతో. వీరు పని చేసేది ఒక్క రాజకీయ అధికారానికే అని సామాన్యులు తెలుసుకునే రోజు ఎప్పుడు వస్తుందో..!! 
 

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

వందమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది " సదుద్దేశ్యం కాదు. ఒక్క దోషి కూడా తప్పించుకో కూడదు.

మీడియా వాళ్లకు నేరాలు ఎక్కువైతే మహదానందం. పైశాచికంగా అవి చిత్రీకరించి ఆనందం పొందుతాయి.

చట్టాలలోని లొసుగులను, వెసులుబాటు లను దుర్వినియోగం చేస్తూ శిక్ష తప్పించుకుంటున్నారు.

అంతర్జాలం మొబైల్ ఇంట్నెట్ వల్ల నేరాలు పెరిగాయి అన్నది నిజం.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు అండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner