15, ఆగస్టు 2021, ఆదివారం

చేసుకుంటున్నాం సంబరాలు...!!

దశాబ్దాలు గడిచిపోతున్నా
మారని మన జీవితాలకు
మరో వత్సరం కలిసినందుకు
చేసుకుంటున్నాం సంబరాలు

శతాబ్దాల చరితను
తిరగరాయలేని అశక్తత
మనదైనందుకు సంతోషపడుతూ
చేసుకుంటున్నాం సంబరాలు

విద్రోహులు మనతోనే ఉన్నా
సర్వమత సౌభ్రాతృత్వం మనదనుకుంటూ
మన చేతగానితనాన్ని దాచేస్తూ
చేసుకుంటున్నాం సంబరాలు

శాంతి కాముకత మన నైజమంటూ
దేశద్రోహమసలే తెలియదంటూ
దేశాన్ని అధఃపాతాళానికి నెట్టేస్తున్నా ఏమెరగనట్లు
చేసుకుంటున్నాం సంబరాలు

నీరాజనాల నీడలో నమస్కారాల మాయలో
నటనలో నిజాయితీగా జీవించే నట నాయకులారా
మిమ్మల్ని మనస్పూర్తిగా నమ్ముతునందుకు
చేసుకుంటున్నాం సంబరాలు...!! 


అందరికి డెబ్భై ఐదేళ్ళ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు... 

 

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఏమున్నది గర్వకారణం అంటారా? అంతేగా మరి. యాంత్రికంగానూ, షో చెయ్యడానికీ చేస్తున్నట్లుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

అవునండి.. ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner