20, ఫిబ్రవరి 2019, బుధవారం
16, ఫిబ్రవరి 2019, శనివారం
ఉచిత సలహాలు..!!
నేస్తం,
వ్యక్తుల గురించి తెలియదు, వారి వ్యక్తిత్వాల గురించి తెలియదు కాని ప్రతి ఒక్కరూ సలహాలిచ్చేటోరే. ఫలానా సంఘటన జరిగింది ప్రపంచం యావత్తూ దిగ్భ్రాంతికి లోనైవుంటే మీరేంటి వెన్నెలపాటలు రాసుకుంటున్నారంటూ కామెంట్లు. కనీసం నేనేం రాశానో కూడ అర్ధం చేసుకోకుండా కామెంట్ రాయడమే వాళ్ళ పని. నా గోడ మీద నాకు నచ్చింది నేను రాసుకుంటాను. సైనికులపై దాడి హేయమైన చర్యే, వారి కుటుంబాలకు జరిగిన నష్టం ఎవరు పూడ్చలేనిది. ఇది జగమెరిగిన సత్యం. పుంఖానుపుంఖాలుగా శాంతి సందేశాలు, బాధాకరమైన పోస్ట్ లు పెట్టేసి వారి కుటుంబాలకు సంతాప సందేశాలు, ప్రొఫైల్ పిక్చర్ మార్చేసి అదీ కాణీ ఖర్చు లేకుండా చెప్పేసి మన బాధ్యత అయిపోయిందనుకుంటే సరిపోతుందా. ఇది తెలియక జరిగిన తప్పిదం కాదు. నన్ను అడిగిన సదరు పెద్దమనిషి దీనికి కారణాలను ప్రభుత్వాన్ని అడిగితే చాలా బావుంటుంది. గోడలలో మీ ముఖచిత్రాలు పెట్టుకున్నారు, కనీసం ఓ సైనికుడి ఫోటో పెట్టలేదు, ఓ సందేశము పెట్టలేదు, నా రాతల గురించి మాట్లాడే హక్కు మీకు లేదని మనవి. నేను ఎప్పుడూ ఎవరి రాతలను క్రిటిసైజ్ చేయలేదు, చేయను కూడా. అయినా నా మీద పడి ఏడుస్తున్నారు కొందరు. కనీసం ఇంట్లోవాళ్ళ గురించి ఆలోచించని వాళ్ళు దేశం గురించి, ఎదుటివాళ్ళ బాధల గురించి ఓ తెగ ఫీలయిపోతున్నారు. ముందు మీ గురించి చూసుకుని తర్వాత పక్కవాళ్ళ లోపాలు వెదకండి...మరోసారి చెప్తున్నా
"నాకు నచ్చింది నేను రాసుకుంటాను."
ఉచిత సలహాలివ్వకండి....
12, ఫిబ్రవరి 2019, మంగళవారం
ఏక్ తారలు...!!
11, ఫిబ్రవరి 2019, సోమవారం
ఖాళీలు మాట్లాడతాయి...!!
ప్రతికూల పరిస్థితిని తనకు
అనుకూలంగా మార్చుకుంటూ
నిస్సహాయతను నీరుకారుస్తూ
సమాధానపు శస్త్రాలను
సూటిగా ఎక్కుపెట్టి
జీవితపు లోటుపాట్లను
పూరించే దిశగా పయనిస్తూ
అనుబంధపు ఆనవాళ్ళకై వెదుకుతూ
రాలిపడుతున్న చుక్కల్లో చేరుతూ
సంద్రపుహోరుకు ధీటుగా
నా మనసు ఖాళీలు మాట్లాడతాయి
అక్షరాలను ఆసరా చేసుకుని...!!
10, ఫిబ్రవరి 2019, ఆదివారం
అవకతవకలు....!!
అయ్యా చంద్రబాబు గారు,
మీరందించిన వరాల జల్లులు కొందరి అతి తెలివి వలన, ఎదుటివారు కూడా ఎందుకు లాభం పొందాలి అన్న కుటిలబుద్దితో ఈ స్కీములకు సంబంధించిన అధికారులతో కుమ్ముక్కై, మీరు డ్వాక్రా మహిళలకు అందించిన సొమ్మును అందరికి చేరనీయకుండా అడ్డుపడుతున్నారు. సదరు అధికారులు వివరాలు అడుగుతున్న మహిళలను చాలా అసభ్యపదజాలంతో అవమానిస్తూ మహిళలకు చేరాల్సిన సొమ్మును తాము పంచుకోవాలని చూస్తున్నారు. దీని వలన మీకు చాలా నష్టం జరుగుతుంది. అతి తెలివి అవకాశవాదుల వలన మీ ఓటమిని మీరే కొనితెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై తక్షణ చర్య తీసుకోవాలని మనవి. లేదంటే మీ ఓటమికి మీరే బాధ్యులౌతారు.


