31, అక్టోబర్ 2012, బుధవారం

ఏదో తెలియని బాంధవ్యం....!!

కదిలి పోతున్న కాలంతో పాటుగా...
నేను..నాతోపాటుగా...నువ్వు...!!
గాలి వాటంగా సాగే జనాలు మనతో పాటు...!!

వదలి పోనని మారాము చేసే జ్ఞాపకాలు...
సుతిమెత్తగా తాకే సుకుమార కుసుమాలు...!!
చివరి వరకు వెంట ఉండే పరిమళాలు....!!

సంద్రంలో అలజడి ఏంటో...!!
ఆకాశం వర్షించడం ఏంటో....!!
కలవని రెండు అంతరాల మధ్య....
ఏదో తెలియని బాంధవ్యం....!!

అచ్చంగా మనలానే కదూ...!!

30, అక్టోబర్ 2012, మంగళవారం

పదవీ విరమణ పండుగ....!!

ఎంతగా అనుకున్నానో.....వెళ్ళాలని....కాని వెళ్ళలేక పోతున్నాను ...నాకు ఎంతో ఇష్టమైన మా శ్రీలత టీచర్ గారి రిటైర్మెంట్ పండుగకు....చాలా బాధగా వుంది...ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న మమ్మల్ని గుర్తు ఉంచుకుని మరీ రమ్మని పిలిచినా వెళ్ళలేని పరిస్థితి..... ఒక్కోసారి అంతే..మనం ఎంతగా అనుకున్నా వెళ్ళలేము....
టీచర్ గారు పాటలు బాగా పాడే వారు పెద్ద పుస్తకంలో బోలెడు పాటలు ఉండేవి.... డాన్సు కుడా బాగా నేర్పించేవారు. ఒకసారి పాటల పోటికి వెళ్తానంటే నాకు నచ్చిన పాటను నేర్పించి పంపారు...కాక పొతే నాకు బహుమతి రాలేదనుకోండి....అక్కడా రాజకీయాలే కదా....!! అయినా నాకన్నా బాగా పాడారులెండి...-:)...!!
మేము కొంత మందిమి టీచర్ గారి దగ్గరే పడుకునే వాళ్ళము..అప్పుడప్పుడు సినిమాలకు కూడా వెళ్ళేవాళ్ళం అలా చూసిందే గోపాలరావు గారి అమ్మాయి......మిలటరీ హోటల్ లో బిరియాని భలే వుండేది...ఎప్పుడన్నా తినేవాళ్ళం..!! కృష్ణాష్టమికి  కృష్ణుడిని భలే అలంకరించి పూజలు చేసే వాళ్ళం...పెద్ద కృష్ణుడి బొమ్మ వుండేది ఆవిడ దగ్గర...!!
తరువాత కూడా...చాలా రోజులకి టీచర్ గారి దగ్గరకు వెళ్తే  అచ్చం మా అమ్మాయి కూడా   నీ లానే  అల్లరి చేస్తోంది అని ముద్దుగా తిట్టారు....ఆ మద్య చిన్నప్పటి నేస్తాలు అందరమూ కలిసినప్పుడు టీచర్స్ అందరిని కూడా  పిలిచి మాకు తోచినట్లుగా గౌరవించాము....ఆరోజు నన్ను ఎప్పుడు చూస్తానా అని వుందని అందరితో అన్నప్పుడు భలే సంతోషం వేసింది...
ఎందరినో....మంచిగా తీర్చిదిద్దిన మా శ్రీలత గారు మళ్లి జన్మలో కూడా టీచర్ గానే పుట్టాలని వుందని మాలాంటి వారే తనకు శిష్యులుగా కావాలని చెప్పారు....మేమందరం(విద్యార్ధులు) తన ఆస్థి అని గొప్పగా చెప్పుకున్నారు....ఇంతకన్నా మాకు మాత్రం ఏం కావాలి...
రేపు పదవీ విరమణ చేస్తున్న ప్రియాతి ప్రియమైన శ్రీలత టీచర్ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఇంకా మాలాంటి ఎందరినో తయారు చేయాలని ఎప్పటికి మీ చిరునవ్వు అలానే వుండాలని కోరుకుంటూ ప్రేమతో....మీ ప్రియ శిష్యురాలు                                                                                                                                                          

29, అక్టోబర్ 2012, సోమవారం

నేను - అహం - దేవుడు

కొందరికి నేను  అన్న అహం చాలా ఎక్కువగా వుంటుంది....
కొందరేముంది అందరమూ అనుకుంటాము...నాకు నేను గొప్ప అని అది మామూలు విష్యం.
కాకపొతే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే చాలా కొద్ది మందికి నేను అన్న అహంకారం అహంతో మిళితమై పోయి ఉంటుంది...మనకి మనం గొప్ప కావచ్చు కాని దేవుని కన్నా గొప్పవాళ్ళం కాలేము కదా ఎన్ని జన్మలెత్తినా...!!
దేవుడు మన దగ్గరికి వస్తాడు కనిపిస్తాడు ఎప్పుడంటే...నేను అన్న మన అహం తొలగినప్పుడు...!!

గుడికి వెళ్లి వచ్చినంత మాత్రాన మనం పవిత్రులమై పోము...వెళ్ళనంత మాత్రాన అపవిత్రులం కాము...ఎన్ని సార్లు గుడికి వెళ్ళాము అని కాదు ఎంత బాగా దేవుని దర్శించుకున్నాము...మనసు ఎంత నిర్మలంగా ఉంచుకున్నాము..మనం చేసే పని వల్ల కాని, మన మాటల వల్ల కాని ఎదుటి వాళ్ళు ఎవరైనా బాధ పడుతున్నారేమో అని మాత్రం ఆలోచించం...వయసు తో పాటు కొంత మందికి బుద్ది పెరుగుతుంది...మరి కొంతమందికేమో...మందగిస్తుంది....!! మన గొప్ప మనం డబ్బా కొట్టుకుంటే ఎలా..!! నలుగురూ డప్పు కొడితే...బావుంటుంది కదూ..!!

నా వరకు నేను అనుకుంటాను నేను చాలా బాగా నా బాధ్యతలు బంధాలు నిర్వర్తిస్తున్నానని...కాని లోటుపాటులు ఎన్ని వున్నాయో....నాకు తెలియదు కదా...!! బాధితులకు తెలుస్తుంది...!! కాకపొతే ఏంటంటే...ఈ రోజుల్లో అన్ని బంధాలు బాధ్యతలు డబ్బుతో మాత్రమె ముడి పడి వున్నాయి...అది ఏ బంధమైనా కానివ్వండి..డబ్బే మూలం...!!
అయినా దేవుడే అందరికి మంచివాడు కాదు..అలాంటప్పుడు మనం మాత్రం ఎంత వరకు మంచిని డబ్బిచ్చి కొనుక్కోగం చెప్పండి..?? -:)
పుడుతూ ఏమి తీసుకురాము...పోతూ ఏమీ తీసుకువెళ్ళలేము...అయినా ఎందుకో అహాన్ని వీడలేము...అదే మన బలహినతేమో..!! మహాత్ములకు మనకు మధ్య తేడా అదే కదా...-:)...!!

గమనిక: ఇది ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు కోపం తెచ్చుకోకండి ఎవరూ...!!
కాస్త ఆలోచించండి అంతే..!!

28, అక్టోబర్ 2012, ఆదివారం

బతుకు పయనానికి....అన్వేషణ.

ఆట ఆట దేవుడు మనతో ఆడే ఆట
పరుగు పరుగు కాలంతో పరుగు
ముడి ముడి జీవితంతో ముడి
జీవితం జీవితం ప్రతి క్షణం పోరాటం

ఆటలో ఓడినా  పరుగు ఆపినా
ముడి విడిపోయినా జీవితంలో....
మిగిలేది ఓటమే...ఒంటరితనమే...!!
దైవం ఆడే చదరంగంలో...గెలుపోటములు
దైవాధీనాలే....!!

అయినా పోరాటం తప్పదు....జానెడు పొట్టకు...
బతుకు పయనానికి....కాలంతో...పరుగు...!!

గులక రాళ్ళున్నా...గులాబి ముల్లు గుచ్చుకున్నా...
మల్లెల సౌరభానికి ఎంత దూరమైనా....
పయనాన్ని సాగిస్తాం...రేపటి మీద ఆశతో...
ఈ రోజు నిరాశని మర్చిపోయి...!!
ఇదే సగటు మనిషి జీవన విధానం.!! 

పుట్టినరోజు పాపాయి.....!!

         ప్రియాతి ప్రియమైన ప్రియకు
           పుట్టినరోజు శుభాకాంక్షలు          
                       ప్రేమతో
                    అమ్మ  నాన్న 
              నాయనమ్మ  తాతయ్య
             అత్త   సుబ్బారావు తాత
               పెదనాన్న మంజమ్మ
                 మౌర్య  శౌర్య  తేజ 
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner