ప్రాణాల ప్రాంతమేదో...!!
కులమేదో మతమేదో....!!
జాతేదో రీతేదో తావేదో....!!
భాషేదో భావమేదో....!!
పుట్టినదెక్కడో గిట్టినదెక్కడో....!!
అయినా ఆత్మబంధువులోక్కరే....!!
నా నీ బేధం లేదు
తర తమ తారతమ్యం లేదు
అందరినొకటిగా చేరవేసే గమ్యం దిశగా
నిరంతరం అదే ప్రయత్నంలో
నిన్ను నీవు మరచి ఆపదల్లో అండగా
అలుపెరగక అలసట చెందక
అందరిలో మీరుగా అన్నింటా చేయూతగా
ఆదుకుని ఆసరానిచ్చే మీ ఆలంబనకు
నా అక్షర నీరాజన పాదాభి వందనం
భరత మాత ముద్దు బిడ్డల్లారా
ఓ వీర జవానుల్లారా...!!
మరువదోయి మీ త్యాగనిరతి
భతర జాతి ఉన్నంత వరకు....!!
మనసున్న ప్రతి ఒక్కరు
పలుకుతారు మీకు నివాళి....!!
(ప్రకృతి విలయానికి అసువులు బాసిన ప్రాణాలను, జీవంతో ఉన్న జీవాలను అత్యంత శ్రమకోర్చి వారి వారి గమ్యాలకు చేర్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి అంకితం )
5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చక్కగా వ్రాశారు.
జవానులు ఎంతో అభినందనీయులు.
Well said
We are proud of our beloved Army.
jai jawan jai jawan..
మీ అందరి మంచి మనసుకు నమో వందనం
మీకు శిరస్సువంచి నమస్కరిస్తున్నా.జై జవాన్!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి