
మనం చూడగలిగే రంగులను వర్న విభాగాలుగా చేసి ఆనందిస్తున్నాము. చూడలేని ఆ కనులకు అన్ని వర్నాలు ఒక్కటే. బ్లాక్ ఫ్లవర్ ఆఫ్ మ్యూజిక్ అంటున్నారు కాని అది నాకు నచ్చలేదు. సప్త వర్నాలను సప్త స్వరాలుగా మార్చి ఆ చిన్నారులు ఆలపిస్తుంటే చూడటానికి కనులెందుకు.....వినే మనసుంటే చాలు అనిపించింది. పాడుతా తీయగా అని.....ఆ ప్రోగ్రాం కి పెట్టి బ్లాక్ అని ఈ ప్రోగ్రాం కి పెట్టడం ఎందుకో బాధగా అనిపించింది...కాస్త మనసుతో ఆలోచించి ఉంటె బావుండేది పేరు పెట్టె ముందు. మనసుతో చూడగలిగే వినగలిగే ఆ చిన్నారులు అన్ని ఉన్న మనలాంటి వారి కన్నా చాలా గొప్పవారు. వారి గొప్ప మనసుకు నా వందనం.
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మంజు గారు, మీకు గుర్తుందో లేదో అప్పుడెప్పుడో బాలీవుడ్లో బ్లాక్ అనే ఒక అంధురాలి కథాంశంతో వచ్చింది,ఆ ప్రేరణతోనే పెట్టి ఉండొచ్చు.
నాకు కూడా ఈరోజు అదే అనిపించిందండి మంజు గారు
I too agree with ur opinion.
ఆ సినిమా నేను చూశాను కాని ఇలా డిగ్రేడ్ చేయడం నాకు బాధ అనిపించింది. ధన్యవాదాలు హృదయం గారు చిన్ని గారు, అను గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి