అందకుండా అల్లరిగా అటు ఇటు
పరుగెత్తి పోతున్నాయి పట్టుకోమంటూ.....!!
పద లయల హొయలతో పూజిద్దామంటే
పట్టు చిక్కకుండా జారిపోతూ
పదాలు పరాకుగా శీతకన్నేసాయి....!!
వాయు లీనాలలో స్వరం కలిపి
మనోగీతాన్ని వినిపిద్దామంటే
మూగవోయిన స్వరం పలుకలేనంటోంది....!!
అక్షరాలు పదాలై...పదాలు పద కావ్యాలై...
కావ్య మాలికలు కుసుమాక్షర నీరాజనాలై....
సుస్వర సరిగమలుగానిను చేరే క్షణం...!!
మానసం ముగ్ధ మోహనమై
మౌనాన్ని వీడి....నీ సమక్షంలో...
గుప్పెడు గుండెలో పిడికెడు ప్రేమను కోరుతోంది....!!
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
Very nice.
Thank u Vanaja garu
ఒక అందమైన కవితను చదివిన అనుభూతి ...
ధన్యవాదాలు ఆలీ గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి