ముద్దు మురిపాలలో ముంచి
అల్లరి ఆటలు కోపాల బుంగమూతి అలుకలు
అది కావాలి ఇది కావాలి అని మారాలు....
అమ్మా..!! కధ చెప్పవూ అంటూ
పక్కనే చేరి వింటు వింటూనే
నిదురమ్మ ఒడిలో చేరి
అమ్మ చేతి స్పర్శలో హాయిగా
బజ్జుండిన ఆ నువ్వేనా...!!
ఎదిగిన వయసుతో
పరిణితి చెందిన మనసుతో
అమ్మకు తోడుగా నీడగా
ఆసరాగా ఆలంబనగా
అమ్మ ప్రపంచమే నువ్వుగా
అమ్మతో స్నేహ బుజ్జాయిలా ఈనాడు....
ప్రతి పుట్టినరోజు సంతోషంగా జరుపుకోవాలని ఆశల తీరాలను అందుకోవాలని కోరుకుంటూ
ప్రేమతో
అమ్మ
( ఓ అమ్మ తన ఎదిగిన కొడుకు కోసం తన మనసును అక్షరాలుగా అడిగితే రాసిన కవిత )
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
తను కని పెంచిన మొక్కే మానయితే ఆనందించేదే "తల్లి"
అవును శర్మగారు ...ధన్యవాదాలు మీ స్పందనకు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి