ఆత్మ సాక్షాత్కారమే మనని మనం తెలుసుకునే పయనంలో చివరి మజిలి అనుకుంటే మరి మనతోపాటుగా పెనవేసుకున్న ఈ అన్ని మోహావేశాలను వదలగలిగే అవకాశం చాలా కొద్ది మందికే దక్కుతుంది.....!! మనకున్న బాధ్యతలను వదలి పోవడానికి అంగీకరించని మనసు వాటితో పాటుగా ప్రయాణిస్తూ మన చివరి మజిలి వరకు వదలి పోలేదు...మన కోసం కాకుండా మన అనుకున్న వారి కోసం పెంచుకునే ఈ అనుబంధాలు అంత తొందరగా తెంచుకోలేము.... అలా చేయగలిగితే మనము చరిత్రలో చెప్పుకోవడానికి మిగిలి పోతాము...కాని మన బాధ్యతలను వదలి వారి లెక్కల్లో ఉండటం ఎంత వరకు సమంజసం...!! భగవంతుడు నీకు నిర్దేశించిన బాధ్యతలను పూర్తిచేస్తూ నిన్ను నీవు తెలుసుకుంటూ నీ మనసు చెప్పిన గమ్యం వైపు వైపు నీ పయనం సాగిస్తే...!!
ఇది ఎవరిని కించపరచడానికి రాయలేదు నాకు అనిపించిన భావాలకు నాకు తెలియని గమ్యానికి నా బాధ్యతలను వదలలేని నా మనస్సాక్షిని... అసలు జీవితానికి గమ్యం ఏంటి అంటూ ఓ అత్మీయుని కోసం రాశాను... దొరకలేదని నాకు తెలుసు... తెలిసిన పెద్దలు ఎవరైనా చెప్తారేమో అని.... నన్ను నా భావాలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా మనఃపూర్వక నమస్సులు....ఇది నా బ్లాగులో ఏడు వందల పోస్ట్ లు పూర్తి చేసుకుని ఏడువందల ఒకటోది...-:)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఆత్మ సాక్షాత్కారమే మనని మనం తెలుసుకునే పయనంలో చివరి మజిలి అనుకుంటే మరి మనతో పాటు గా పెనవేసుకున్న ఈ అన్ని మోహావేశాలను వదల గలిగే అవకాశం చాలా కొద్ది మందికే దక్కుతుంది.....!
అమలుపరచ గలిగే ప్రయత్నం అవసరం
ఎంతో చక్కని నిజం
అభినందనలు మంజు గారు!
dhanyavaadaalu chandra gaaru
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి