అభిమానంతో ఇచ్చిన పుస్తకాలు దయచేసి పాత పుస్తకాలుగా అమ్మకండి... మీకు ఇష్టం లేకపోతే తీసుకోకండి. అంతేకాని రాసిన వారిని అవమానించకండి.. కాని దీని మూలంగా నాకు రెండు మంచి పనులు జరిగాయి. చదువుకునే పుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు తెలియని వారు ఆ పుస్తకాలు వెతుకుతూ నా పుస్తకం అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు ని పాత పుస్తకాల షాపులో కొన్నారు. మరొకరు సడిచేయని (అ)ముద్రితాక్షరాలు పుస్తకాన్ని అలాగే పాత పుస్తకాల షాపులో కొని రేడియో లో ప్రోగ్రామ్ చేసారట. పుస్తకాలను అవమానించకండి...
18, మార్చి 2019, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చాలా బాగా చెప్పరు. నాకు పుస్తకాలంటే పిచ్చి.నా వద్ద చాలా పుస్తకాలున్నాయి. మొదట్లో నాకు తెలిసినవారికి అడపాదడపా నా వద్ద నున్న పుస్తకాలు ఇచ్చేదాన్ని చదవమని. ఒకరిద్దరు తప్ప..మిగిలిన వారి ఇంట్లో ఆ పుస్తకాలకి దుమ్ము పట్టటమో, లేదా పాత పేపర్లూ..ఇనుపసామానుల వాడికి ఇవ్వడమో చేసేవారు. అప్పటి నుండి పుస్తకాలు ఇవ్వడం మానేసా. ఎవరైనా చదివి ఇస్తాం అని అడిగితే తప్ప.!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి