2, మార్చి 2020, సోమవారం
ఆత్మ పయనం..!!
అమ్మకెపుడూ
బరువు కానిది
తల్లి ఎప్పుడూ
తట్టుకోలేనిది
బిడ్డ దూరమైన క్షణాలను
మమకారపు మాధుర్యాన్ని పంచుతూ
కన్నపేగు బంధాన్ని కావలి కాచుకుంటూ
బుజ్జగింపుల ఊరడింపులను
ఆకతాయి అల్లరిని
ఓరిమిగా భరించేది మాతృ హృదయం
దైవంతో సైతం సవాలంటుంది
దేనికైనా తెగిస్తుంది
తన ప్రాణాలను పణంగా పెడుతుంది
ఏ లోకానికైనా పోతానంటుంది
కనుల ముందే కడుపుతీపి కరువౌతుంటే
కన్నీటి వీడ్కోలు
కడసారి చెప్పలేక
తల్లడిల్లే ఆ కన్నతల్లి
ఆత్మఘోషకు
సాంత్వనమెక్కడ...?
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
// “ కుపల ముందే ..... “ //
“కనుల ముందే” అనాలేమో??
కవిత చాలా బాగా వ్రాశారండి.
మాకు తెలిసిన ఒక కుటుంబంలో తల్లి బ్రతికుండగానే కొడుకు హఠాత్తుగా చనిపోయాడు (60 యేళ్ళ వయసులో); అంత్యక్రియలకు తీసుకువెళ్ళే టయిమైనప్పుడు ఆ తల్లి కొడుకు శరీరం దగ్గర నిలబడి “వచ్తే జన్మలోనైనా పూర్ణాయుష్కుడివిగా ఉండాలి” అన్నది. చాలా బరువైన క్షణాలు అవి.
పొరపాటు అండి. మార్చాను... ధన్యవాదాలు అండి మీ స్పందనకు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి