20, ఏప్రిల్ 2020, సోమవారం

వెలుగుల వ్యవస్థకు నీరాజనం..!!

ఈనాడు మనందరం ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా, మన ఉనికిని కాపాడుకోవాలన్నా, ప్రతి ఒక్కరికి అవసరమైనది విద్యుత్...అదేనండి కరంట్. కరంట్ లేనిదే ఏ వ్యవస్థా నిరంతరాయంగా పని చేయలేదు. మన జీవితాల్లో చీకటిని చెరిపేస్తూ, విద్యుత్ అంతరాయాలు రాకుండా మన కోసం ప్రతిక్షణం శ్రమిస్తున్న విద్యుత్ వ్యవస్థ సిబ్బందికి అక్షర నీరాజనం...!! 

వెలుగుల వ్యవస్థకు నీరాజనం..!! 

కాలం విసిరిన రక్కసి 
కరోనా విషపు కోరల్లో 
అల్లకల్లోలమైన జన జీవితాలు

పరిశుభ్రత పాటించాలంటూ
టీకాల పరిశోధనలంటూ
పరుగులెత్తుతున్న ప్రమధగణాలు

రోగులకు సేవలందిచే వైద్యుల
పహారా కాసే రక్షకభటుల
పారిశుద్ధ్య శ్రామికుల సేవలు మరువలేనివి

ఇంటికే పరిమితమైన మన బతుకులకు
నిత్యావసరమైన వస్తువు 
ప్రాణవాయువు విద్యుత్తని మరిచారా

విద్వత్తు విజయం సాధించాలన్నా
ఆసుపత్రుల్లో విధులు నిర్వహించాలన్నా
ఇంటింటి విద్యుత్ పరికరాలు పని చేయాలన్నా 

గూడైనా, గోడైనా, రోడ్డయినా
మనిషి మనిషికి చీకటి వెలుగుల వారధిది
పేదా గొప్ప తేడా తెలియని కరంటిది

పిన్నలు పెద్దలు వాడే సెల్ ఫోన్లకు
పరిశోధకుల పరిశోధనల గెలుపుకు 
ప్రపంచమంతా పాదాక్రాంతమీ విద్యుత్ వ్యవస్థకు

ప్రతి మనిషికి ప్రాణాధారమే
నిత్య దైనందిన కార్యక్రమాలకు నిరంతరాయంగా తమ సేవలనందించే విద్యుత్ సిబ్బందికివే సర్వజన నీరాజనాలు

మీరు లేనిదే మనిషి మనుగడ లేదు
ప్రపంచ మానవాళి కోసం ప్రతిక్షణమూ పని చేసే
మీ అవిశ్రాంత శ్రమకు మా శతకోటి వందనాలు...!! 

ఇది రాయడానికి కారణమైన కృష్ణమెాహన్ గుఱ్ఱం గారికి కృతజ్ఞతలు. 



2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Jai Gottimukkala చెప్పారు...

డాక్టర్లు, నర్సులు, పోలీసులు, సైనికులు, మంత్రులు, అధికారులు, ఉద్యోగులు, వాలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది, చిరు వ్యాపారస్తులు, బక్క రైతులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు: ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనాలు.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner