29, ఏప్రిల్ 2020, బుధవారం

ఏక్ తారలు..!!

1.  కలతలతో పొడిబారిన మనసు_కన్నీళ్ళన్ని కనులకిచ్చేస్తూ..!!
2.  సరిపెట్టుకోవాలనే లలాట లిఖితమిది_ఊరడింపులకు తలొగ్గని కాలంతో..!!
3.  కదం తొక్కే అక్షరాలవి_కలమైనా కాలమైనా దాసోహమనాల్సిందే...!!
4.  ఆ అక్షరాలు గరళాన్ని దాచేస్తాయంతే_గుంభనంగా నవ్వేస్తూ...!!
5.  సారమెరిన కలమనుకుంటా_అగ్నిశిఖల వంటి అక్షరాలను చల్లబరుస్తూ...!!
6.   చీకటంతా చెదిరిపోతుంది_వెన్నెల వచ్చి వాలుతుంటే..!!
7.  కాలం విలువలు చెప్పాల్సిన సమాధానమిది_మారుతున్న బాంధవ్యాల అర్థాలను...!!
8.   మమ అంటూ ముగించేసాం యాగాన్ని_ప్రాణాలతో చెలగాటమే ఇక..!!
9.  బ్రతిమాలినా బామాలినా కాలమంతే_కదిలిపోతుంది తనకేమీ పట్టనట్టుగా..!!
10.   అద్భుతమే అక్షరాలు_భవబంధాలను భావాల్లో చూపెడుతూ..!!
11.  అనుకోని ప్రయాణమిది_తెలియని గమ్యానికై వెతుకుతూ...!!
12.   చెలిమిని వీడలేనంటోంది మనసు_అహం అడ్డుగోడగా నిలిచినా...!!
13.  సుమం సౌకుమార్యం మనమెరగాలి_ఆటుపోట్లకు అల్లాడకుండా చూసే బాధ్యతతో...!!
14.  వేదనలన్నింటికీ ఊరటే_నినదించే నివేదన వినిపించినప్పుడు..!!
15.   మాటల ఆప్యాయతలా లాక్కువస్తుంది_బాధలో ఓదార్పునిస్తూ...!!
16.  భారం భావమౌతుంది_అక్షరాల్లో ఆత్మీయత దొరుకుతుంటే...!!
17.  బంధం అక్షరాల్లో చేరింది_అందరిని అలరిస్తూ..!!
18.   వాస్తవం వందనంగా ఉంది_అక్షరానుబంధానికి జేజేలంటూ...!!
19.   హద్దు దాటనంత వరకు అన్నీ ముద్దే_అది అక్షరమైనా అహంకారమైనా...!!
20. అరుదుగా కనిపిస్తుంటాను_అవసరం నాదైనప్పుడు..!!
21.   క్షణాలన్నీ అక్షరాలతోనే_నాతో నేనున్నప్పుడంతా..!!
22.  నికరమైనదే అక్షరం_కాలాన్ని జ్ఞాపకంగా పదిలపరుస్తూ...!!
23.   వెదుకుతూనే ఉంటాను_రాలిపడిన క్షణాల్లో జారిపోయావేమెానని..!!
24.   మాయతనమే మరి_కనబడినా కనబడకున్నా గుర్తుండిపోతూ..!!
25.   తత్వమేదైనా తమెాగుణముంటే చాలు_మనిషితనానికి ఆభరణమే..!!
26.   అసలు రంగులు తెలిసిపోయాయి_అయినవారెవరో కానివారెవరో ఎరుకై..!!
27.  నలుగురితో నడవక తప్పదు_నైజం తెలిసినా..!!
28.   ఓటమికి విజయాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాయి_ఓరిమితో అక్షరాలు..!!
29.  నా గెలుపులో నీ భాగమూ ఉంది_మంజువాణి మానసాక్షరాలుగా...!!
30.   అమ్మతనం శిక్ష అనుభవిస్తోంది_దైవమిచ్చే తీర్పులకు..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner