30, మే 2020, శనివారం
భూతల స్వర్గమేనా... 12
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం లో ఇబ్బందులు... జీతం కుడా ఇవ్వకుండా పని చేపించుకునే యాజమాన్యం... రాజీనామా... మరో ఉద్యోగ వేట... ఎన్ని ఎబ్బందులో...
నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి, రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం లో ఇబ్బందులు... జీతం కుడా ఇవ్వకుండా పని చేపించుకునే యాజమాన్యం... రాజీనామా... మరో ఉద్యోగ వేట... ఎన్ని ఎబ్బందులో...
29, మే 2020, శుక్రవారం
మన చరిత్ర...!!
27, మే 2020, బుధవారం
ఏక్ తారలు
25, మే 2020, సోమవారం
పట్టలేని సంతోషం...!!
నేస్తం,
ఈమధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పాలని చాలా రోజుల నుండి అనుకుంటూనే ఉన్నాను కాని కుదరలేదు. యాభైల్లో పడుతున్న వయసుకి చిన్నప్పటి నేస్తాల పలకరింపులు, అదీ ఎన్నో ఏళ్ళ (1985 నుండి 2020) తరువాత అయితే ఆ సంతోషం ఎలా ఉంటుందంటావ్? నేను చెప్పనా... నాకిష్టమైన సముద్రం దగ్గర నిలుచుని, ఆ అలలతో ఆడుకున్నంత సంతోషమన్న మాట.
సరదాగా చూసే యుట్యూబ్ ఛానల్ లో జాతకం రేపటి రోజుది వింటే మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు అని చెప్తే, అసలే కరోనా కాలమని ఎలా జరుగుతుందని తీసిపారేయకండని కూడా చెప్పారు. నవ్వుకున్నా అప్పుడు. మరుసటి రోజు పొద్దున్నే నా మెసెంజర్ లో నా ఫ్రెండ్ లిస్ట్ లో లేని వారి దగ్గర నుండి మెసేజ్. తనెవరో వివరంగా పెట్టారు. మాతో కలిసి చదువుకున్న చిన్ననాటి మిత్రుడు మంగారావు. వెంటనే ఫేన్ నెంబరడిగి ఫోన్ చేసి మళ్ళీ బాల్యాన్ని పలకరించేసాం. మరో బస్ ఫ్రెండ్ శ్రీదేవి మంగారావు వాళ్ళ వదిన. తన నెంబర్ కూడా తీసుకుని తనతో కూడా కబుర్లు పంచేసుకున్నా. బాగా చిన్నప్పటి ఫ్రెండ్ గత 7,8 ఏళ్ళుగా మాట్లాడని మా అల్లరి బాచ్ సత్యన్నారాయణ కూడా పలకరించేసాడీ మధ్యనే.
అనుకోని మరో కబురేంటంటే జొన్నవలస స్కూల్ లో మా సీనియర్ పార్వతి వా నెంబర్ వాళ్ళ ఫ్రెండ్ ఎర్రయమ్మని అడిగి మరీ నాకు ఫోన్ చేసింది. ఎన్ని కబుర్లు చెప్పేసుకున్నామెా... కార్తీకం మాసంలో పులిహోర చేయించుకుని వన భోజనాలకి వెళ్ళడం, టిటిడి వారి పరీక్ష రాసేసి సినిమాకి వెళ్ళడం, భీమ్ సింగ్ బ్రిడ్జ్ పై చిరంజీవి గూండా సినిమా షూటింగ్ కి స్కూల్ ఎగ్గొట్టి, నాతోపాటు మరో నలుగురిని కూడా తీసుకువెళ్ళి, మరుసటిరోజు ప్రేయర్ లో అందరి ముందు హెడ్ మాస్టారితో తిట్లు... నన్నేం అనలేదు కాని..." ఎంతో తెలివి గల ఈ పాప కూడ వెళ్ళింది " అనే అన్నారు. కాకపోతే మా హిందీ టీచర్ బాగా తిట్టారనుకోండి క్లాస్ లో...ఇలా మా చిన్నప్పటి జ్ఞాపకాలనన్నింటిని గుర్తు చేసేసుకున్నాం..మనకి అందరు గుర్తున్నా మనం కూడా కొందరికి గుర్తుండటం భలే బావుంటుంది...అదీ సీనియర్స్ కూడా గుర్తుంచుకోవడం ఇంకా బావుంటుంది. కాని నాతో కలిసి ఆడుకున్న ఒకరు నన్ను మర్చిపోయారు...నా పేరు చెప్తే గుర్తు రావాలి కదా... ఎప్పటికో గుర్తు వచ్చిందట... 😊
పనిలో పని మీకు ఓపాలి గతాన్ని పలకరించి రారాదు...ఎంత బావుంటుందో తెలుస్తుంది...
నా గురించి...!!
కాలం వెంబడి కలం...3
24, మే 2020, ఆదివారం
రత్నారెడ్డి యేరువ...!!
23, మే 2020, శనివారం
భూతల స్వర్గమేనా...11
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం అనుభవాలు... అప్పట్లో టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ లు రేట్లు ఎలా ఉండేవో తెలిస్తే...
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం అనుభవాలు... అప్పట్లో టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ లు రేట్లు ఎలా ఉండేవో తెలిస్తే...
21, మే 2020, గురువారం
చీకటి కల..!!
20, మే 2020, బుధవారం
బతకాలన్న ఆశ...!!
వేసారిన వలస బతుకులు...!!
19, మే 2020, మంగళవారం
నీ పాదం..!!
18, మే 2020, సోమవారం
కాలం వెంబడి కలం.. 2
పుస్తకాలు చదవడం అన్న అలవాటు నాతో పాటుగా పెరుగుతూనే వచ్చింది. దానికి మరో కారణం నేను చదువుకున్న స్కూల్ కూడా. శ్రీ గద్దే వేంకట సత్యన్నారాయణ శిశు విద్యామందిరం, అవనిగడ్డ. మా స్కూల్ లో మాకు మెుదటి నుండి కూడా చదువు ఒక్కటే కాకుండా, పద్యాలు, పాటలు, ఆటలు ఇలా అన్నీ నేర్పించేవారు. మీరు నమ్మలేరేమెా కాని 1977, 78 ఆ టైమ్ లో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం 3వ తరగతిలోనే నేర్పించారు. రోజూ ప్రార్థన అయ్యాక, ఓ సంస్కృత శ్లోకం చెప్పి దానికి తెలుగు అర్థం కూడా చెప్పాలి. (3వ తరగతి నుండి 6వ తరగతి వరకు నేను నా ఫ్రెండ్ ప్రార్థన చెప్పేవారము.) ఆరోజు వార్తలు కూడ చదివించేవారు. ఇక సాయంత్రం హనుమాన్ చాలీసా, భగవద్గీత చదివించేవారు. రోజూ వ్యాయామం, ఆసనాలు, సూర్య నమస్కారాలు చేయించేవారు. మాది గురుకుల పాఠశాల అప్పట్లో. ఆర్ ఎస్ ఎస్ భావాలు బాగా ఉండేవి. నేను ఆ స్కూల్ లో 2వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదివాను. విలువలు, మంచి నడవడి, చదువు నేర్పిన దేవాలయమది.
అమ్మమ్మ మా దగ్గర ఉండి చదివించేది. అమ్మ వాళ్ళు మా ఊరిలో ఉండేవారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే అమ్మమ్మ నన్ను కోప్పడినా, ఏమైనా అన్నా వెంటనే పుస్తకంలో రాసేదాన్నట. నాకు గుర్తు లేదది. మా పక్కన ఉండే అక్కవాళ్ళు చెప్పేవారు. అన్ని రాసి అమ్మ వచ్చినప్పుడు చెప్పేదాన్నట. బహుశా ఇలా రాయడం కూడా అప్పటి అలవాటేనేమెా మరి. నాకు తెలిసి 6వ తరగతిలో మా స్నేహితుల మధ్యన గొడవలు జరిగినప్పుడు వెంటనే అది కథలా రాసి మా పిన్నికి చూపించడం, తను మీ విషయాన్నే కథగా రాశావా అనడం నాకిప్పటికి గుర్తే.
2వ తరగతిలో రాధాకృష్ణ సీరియల్ తో మెుదలైన నా పుస్తక పఠనం అంచెలంచెలుగా చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి వగైరాలతో ఆగకుండా, దినదిన ప్రవర్ధమానమై ఆంధ్రభూమిలో తులసిదళం, తులసి, ప్రార్థన, కాష్మోరా అంటూ బాగా విస్తరించింది. నేను ఈ పుస్తకాల పురుగునే అని నాకు చదువు రాదనుకోకండి... మా క్లాస్ లో సెకెండ్ నేనేనండి. టీచర్స్ అందరికి నా పుస్తకాల పిచ్చి తెలుసు. డిబేట్లలో కూడా ముందు ఉండేదాన్ని అప్పట్లో. ఇప్పుడు మాటలు రావులెండి... 😊
మరిన్ని కబుర్లతో వచ్చే వారం...
16, మే 2020, శనివారం
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం... సబ్జెక్టు ఉంది కాని ప్రాక్టికల్ లేదు... ఉదోగం లో ఎలా నెట్టుకు వచ్చిందో...
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం... సబ్జెక్టు ఉంది కాని ప్రాక్టికల్ లేదు... ఉదోగం లో ఎలా నెట్టుకు వచ్చిందో...
భూతల స్వర్గమేనా..!! 10
15, మే 2020, శుక్రవారం
పేరు వెనుక కథాకమామీషు..!!
13, మే 2020, బుధవారం
ఏంటో పాపం...!!
నేస్తం,
మనం మన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే వెసులుబాటున్నప్పుడు, అదే అవకాశం మిగతావారికి కూడా ఉంటుందని ఎందుకు ఆలోచించలేకపోతున్నాం. కళ్ళున్నా చూడలేని చదువుకున్న మూర్ఖులు ఎందరితోనో మనం కలిసి సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఒకరంటారు ప్రతిపక్షం సరైన బాధ్యత తీసుకోవడం లేదని. మరొకరంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీస బాధ్యతగా అసెంబ్లీకి రాని వాడికి అధికారం కట్టబెట్టిన జనాన్ని ఏమనాలని. విషవాయువుతో ప్రాణాలు కోల్పోయిన జీవాలకు కోట్లు వెదజల్లుతామంటున్నారు కాని దానికి కారణమైన వారిపై కనీస చర్యలు తీసుకోలేదు. ఎదురు బాధితులు మీద కేసులు పెట్టడం, కరంటు బిల్లులు ఇస్తున్న షాక్ నభూతో నభవిష్యతి.
మీకు వ్యక్తి నచ్చితే గుడి కట్టి పూజ చేసుకోండి,తప్పులేదు. కాని రాష్ట్రం ఏ స్థితి నుండి ఏ స్థాయికి పడిందో లేదా ఎగసిపడిందో, ఈ సంవత్సరం నుండి జరిగిన అభివృద్ధిపై కాస్త ఓ పోస్ట్ రాద్దురూ. మేమూ చూసి సంతోషంతో కడుపు నింపుకుంటాం. అంటే మీ దృష్టి కోణంలో పురోగతి ఏమిటో వివరించమని మనవి. పాలన చేయాల్సింది, రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టాల్సింది (మీ దృష్టి లో ఇంతకు ముందు ఏమి అభివృద్ధి జరగలేదు కదా) పాలకపక్షమని మరిచిపోతే ఎలాగండి? కుల వివక్షతో ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయని పాలనని మీకనిపించక పోవడం దురదృష్టం. పారదర్శకులమని చెప్పుకుంటే చాలదు. పార్టీలకు కొమ్ము కాయమని చెప్పుకుంటే సరిపోదు. ఎవరికి వారు అందరు గురువింద గింజలే మరి. మనం ఒకటి అంటే ఎదుటివారు వంద అనగలరు..పడే వాడికి తెలుస్తుంది ఆ బాధ. ఒడ్డున ఉండి సవాలక్ష చెప్తాం మనదేం పోయిందని. గౌరవం మనకంటూ మనం ఇచ్చేటట్లు ఎదుటివారి ప్రవర్తన ఉండాలి. పదవి, అధికారానికి విలువ ఇవ్వాలంటే వాటికి వన్నె తెచ్చే వ్యక్తిత్వం వారికుండాలి. అంతేకాని అడుక్కుంటేనో, భయపెడితేనో గౌరవం ఇవ్వరు.. జర గుర్తుంచుకోండి సారూ... 😊
11, మే 2020, సోమవారం
కాలం వెంబడి కలం...!! 1
9, మే 2020, శనివారం
భూతల స్వర్గమేనా..!! పార్ట్ 9
ఆంద్ర ఆడపడుచు కొత్త ఉద్యోగ లో చేరడం కోసం మరో సిటీకి ప్రయాణం... ఫ్లైట్ డిలే తో 3 కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్... మూడు ఎయిర్ పోర్టులలో నిరీక్షణలో ఏమి జరిగిందంటే...
ఆంద్ర ఆడపడుచు కొత్త ఉద్యోగ లో చేరడం కోసం మరో సిటీకి ప్రయాణం... ఫ్లైట్ డిలే తో 3 కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్... మూడు ఎయిర్ పోర్టులలో నిరీక్షణలో ఏమి జరిగిందంటే...
4, మే 2020, సోమవారం
ఆవకాయ..!!
3, మే 2020, ఆదివారం
2, మే 2020, శనివారం
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం కోసం కొత్త కోర్సుల ట్రైనింగ్... అమెరికా ఇంగ్లిషు యాస కోసం కిటుకులు...
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం కోసం కొత్త కోర్సుల ట్రైనింగ్... అమెరికా ఇంగ్లిషు యాస కోసం కిటుకులు...