19, మే 2020, మంగళవారం

నీ పాదం..!!

ఒకప్పుడు
వీనులవిందైన 
మువ్వల సవ్వడితో
రాగానికనుగుణంగా నాట్యమాడే
లయ తప్పని జంట పాదాలవి

మరిప్పుడు 
భిన్న సంఘర్షణలతో
బంధనాలకు లోబడి
తనువు మనసు విడివడి
ఒంటరైన జంట పాదాలివి 

కలిసి నడవక తప్పని
కాలానికి చేరువైన జీవితాన్ని
కాదనలేని మెామాటంతో
బాధ్యతలకు, భావావేశానికి నడుమ
సమన్వయం లోపించకుండా నడయాడుతున్న 
కన్నీటి పన్నీటి కనువిందిది..!! 

వాణి గారు చిత్రానికి రాసిన కవిత చదివి, 
ఈ చిత్రానికి నాకూ రాయాలనిపించిన భావాలివి.. 
థాంక్యూ వాణి గారు... 

 


2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

తెలుగోడు_చైతన్య చెప్పారు...

ఒక పాదం కళను మరొక పదం కష్టాలను కలిపిన భంగిమ వర్ణన అనితరసాధ్యమే... గట్టి ప్రయత్నం చేస్తున్నారు...🙏

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు అండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner