20, మే 2020, బుధవారం

బతకాలన్న ఆశ...!!

ఊహించని విపత్తు
మృత్యువు రూపంలో 
వికటాట్టహాసంతో
కరాళనృత్యం చేస్తూ
కనుల ముందే కదలాడుతుంటే
బతకాలన్న ఆశతో 
ప్రాణాలనరచేతిలో పెట్టుకుని
అనుబంధాలను వెదుకులాడుతూ
భయం గుప్పిట్లో బంధీగా మారినా
కన్నెర్రజేసిన ప్రకృతి సహకరించకున్నా
కకావికలమై నలుదెసలు 
పరుగులు పెడుతున్న జీవకోటిని
రక్షించే నాధుడే భక్షకుడైన వేళ
వారి మెురనాలకించే ఆపద్భాంధవుడెవ్వరు? 0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner