27, మే 2020, బుధవారం
ఏక్ తారలు
1. ఓదార్చే అక్షరాలను నీకందిస్తున్నా_వేదనకు వీడ్కోలిమ్మంటూ..!!
2. రంగుల మాయ అలాంటిది మరి_మార్పు కాలానికేం తెలుసు పాపం..!!
3. అమ్మ కడుపున పుట్టలేదుగా దైవం_నవ మాసాల విలువ తెలియలేదందుకే...!!
4. తరాజు తూయలేనంటోంది_భారమైన కలల బరువును..!!
5. మదికెప్పడూ మెామాటమే_మౌనం వీడితే మాయమౌతావేమెానని..!!
6. గురుతులెప్పుడూ జ్ఞాపకమే_కాలమెంత వేగంగా పరుగులిడినా..!!
7. తోలు మందమైంది_అవమానమని తెలిసినా ఒప్పుకోలేని అహంతో.. !!
8. నిరీక్షణకు చోటు లేదు_మనసంతా రాయిలా మారిపోతే...!!
9. ఆ రాయిని పూజించే రోజు రాకమానదు_ఓటమి విజయమై చేరితే..!!
10. కొన్ని రాళ్ళు కరగవంతే_నిబద్దతయినా నిజాయితైనా వాటికొకటే...!!
11. స్వప్నాలకు స్థోమత అక్కర్లేదు_నిదురకు మనసునిస్తే చాలు..!!
12. కన్నీటి కథలెన్నయినా కానీ_అక్షరాల్లో చేరాక అవి పన్నీటి చినుకులే...!!
13. వాలే పొద్దులో వర్ణాలు చూస్తున్నా_మనసు కాన్వాసుపై రంగుల లోకం చిత్రిద్దామని...!!
14. క్షణాలెప్పుడూ పదిలమే_కాలమెలా సాగిపోతున్నా...!!
15. అలకలదెప్పుడూ అల్ప సంతోషమే_క్షణాల్లో కోపాన్ని మర్చిపోతూ...!!
16. నలుపు రంగుది విశాల హృదయం_రంగులన్నింటిని తనలో ఇముడ్చుకుంటూ...!!
17. కలలెన్ని సేదదీర్చాయెా కదా_కన్నీళ్ళను తుడుస్తూ...!!
18. మనసునేమార్చే మెళకువ తెలియాలి_కన్నీటిని పన్నీరుగా మార్చడానికి...!!
19. మరుపునే మరిపించాయి_జ్ఞాపకాలను వీడలేని మనసుందని గుర్తుజేస్తూ..!!
20. గుప్పెడు గుండెతో గంపెడాటలు_అలవాటైన వ్యసనమే కొందరికి...!!
21. వర్ణనదేముందిలే_వాచకం బావుంటే చాలట..!!
22. ఓటమి ఆహ్వానాన్ని తిరస్కరించు_గాయాన్ని విజయగీతంగా మార్చుతూ...!!
23. అలవాటైన ఆట కదా_మనసుతో మనిషితనానికి...!!
24. పరిపాటేనని పాత పాటే పాడితే ఎలా_ఏమరుపాటుకి మూల్యం చెల్లించాలేమెా...!!
25. ఏదీ మిగలదేమెా_వెలి వేయడమంటూ మెుదలైతే..!!
26. నిస్సత్తువు నీకేలా_చీకటిలో వెలుగు నింపే చెలిమి నీతోనుంటే...!!
27. నిస్సత్తువు నీకేలా_చీకటిలో వెలుగు నింపే చెలిమి నీతోనుంటే...!!
28. పోగొట్టుకున్న గతాన్ని వెదుక్కుంటున్నా_రాశులుగా పేరుకున్న జ్ఞాపకాల్లో..!!
29. మరుక్షణమే మరిచిపోయి వుంటుంది మానవాళి_కాల్చిన దేహం సాక్షిగా...!!
30. గ్రహణం వీడిన శకునం బావుంది_ఆషాడపు చినుకులతో...!!
వర్గము
ఏక్ తార
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి